Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: సచిన్..ఏ బిలియన్ డ్రీమ్స్

By:  Tupaki Desk   |   13 April 2017 5:02 PM GMT
ట్రైలర్ టాక్: సచిన్..ఏ బిలియన్ డ్రీమ్స్
X

1983 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసిన సచిన టెండుల్కర్.. తాను కూడా ఒక రోజు ఆ కప్ అందుకోవాలని.. తన చేతితో విజేతగా ఆ కప్ ను తాకాలని అనుకున్నాడట. ఇలాంటి మరెన్నో విశేషాలు చెబుతూ ఇప్పుడు ''సచిన్ః ఏ బిలియన్ డ్రీమ్స్'' అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు క్రికెట్ దేవుడు. ఈ డాక్యుమెంటరీ ఫిలిం త్వరలోనే ధియేటర్లలో రిలీజవుతున్న నేపథ్యంలో.. ఇ్పుడు ట్రైలర్ వచ్చేసింది.

జేమ్స్ ఎర్సికిన్ దర్శకత్వంలో.. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ సినిమా మే 26న రిలీజవుతోంది. ఈ సినిమా మొత్తానికి సచిన్ టెండుల్కర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. చిన్నతంలో సచిన ఎలా ఆలోచించాడు.. అతడికి ఎటువంటి ఇబ్బందులు తారసపడ్డాయి.. వాటిని ఎలా అధిగమించాడు.. అనే వాటిని విజువల్స్ లో చూపిస్తూ.. సచిన్ వాయిస్ లో ఒక డాక్యు ఫిలిం తరహాలో ఈ సినిమాను రూపొందించారులే. నిజ జీవితంలో సచిన ఇంటిపైన జరిగిన దాడులు ఫుటేజ్.. అలాగే సచిన్ భార్య అంజలి ఒరిజినల్ వీడియోలు.. పిల్లలతో సచిన్ గడిపిన వీడియోలు.. ఇలా చాలా చాలా ఇందులో ఉన్నాయి. అలాగే సచిన్ చేతిలో వరల్డ్ కప్ పడటానికి ఆద్యుడు అయిన 2013 జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని కూడా సచిన్ గురించి బైట్స్ ఇచ్చేశాడు.

నిజానికి ఇటువంటి డాక్యుమెంట్రీ తరహా సినిమాలు మనోళ్ళకు డిస్కవరీ ఛానల్లో చూడటం అలవాటు. ఈ మద్యన నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో కూడా చూస్తున్నారు. అయితే ఇదే తరహా ప్రోగ్రామ్ ఇప్పుడు వెండితెరపై వస్తుంటే.. దానిని ఎలా ఆదరిస్తారు అనే విషయం తేలాల్సి ఉంది. అది సంగతి.