Begin typing your search above and press return to search.

ఆ సీన్ కోసం బాహుబలి టైపు కష్టాలే

By:  Tupaki Desk   |   17 March 2017 7:14 AM GMT
ఆ సీన్ కోసం బాహుబలి టైపు కష్టాలే
X
బాహుబలి మూవీలో ఒక్క సీన్ సినిమా మొత్తానికి కీలకం. అదే బాహుబలిని కట్టప్ప చంపేసే సీన్. బాహుబలి ది బిగినింగ్ చివరలో చూపించిన ఈ సీన్.. ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి కలిగించింది. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్న జనాల్లోకి వెళ్లిపోయింది. చివరకు బాహుబలి టీం కూడా '#WKKB' అంటూ అదే ప్రశ్నను పోస్టర్లపై హ్యాష్ ట్యాగ్ గా వేస్తూ మరింత ఆసక్తిగా తయారు చేసేశారు.

బాహుబలిని కట్టప్ప పొడిచేసే సీన్ ను ఇప్పటికే చూపించారు. అయితే.. ఆ సీన్ ను తీయడానికి మాత్రం.. బాహుబలి రేంజ్ కష్టాలు పడాల్సి వచ్చిందట. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్.. ఆ సన్నివేశం పిక్చరైజేషన్ వెనక ఉన్న కష్టాన్ని వివరించాడు. 'మేం ఈ సీన్ ని.. ఉత్తరాదిలో ఉన్న చంబల్ వ్యాలీలో తీద్దామని భావించాం. కానీ మేం అక్కడికి షూటింగ్ వెళ్లాల్సిన నెల రోజుల ముందు భారీ వర్షాల కారణంగా.. ఎండిపోయినట్లుగా ఉండే ప్రాంతం అంతా పచ్చగా మారిపోయింది. దీంతో మేం లొకేషన్ మార్చుకోక తప్పలేదు. చివరకు హైద్రాబాద్ పరిసరాల్లో ఉన్న ఓ క్వారీ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. కానీ ఆ ఏరియా మొత్తాన్ని రీ డిజైన్ చేయాల్సి వచ్చింది' అని చెప్పాడు ఆర్ట్ డైరెక్టర్.

'ఆ క్వారీలో 100 ట్రక్కుల బురదను తొలగించి.. రోడ్లు వేసుకున్నాం. మాకు కావాల్సిన లుక్ కోసం రాజస్థాన్ నుంచి 30 చెట్లు తీసుకొచ్చి.. వాటికి డూప్లికేట్స్ ను కూడా తయారు చేశాం. అక్కడ కనిపించే ప్రతీ రాయి.. 60 అడుగుల ఎత్తు ఉంటుంది. వాటికి రెడిష్ కలర్ వేసి.. షాట్స్ తీశాం. ఈ పనంతా పూర్తి చేయడానికి 200 మంది వర్కర్క్ 45 రోజుల పాటు రాత్రి పగలు కష్టపడ్డారు' అని చెప్పాడు సాబు సిరిల్. అంత కష్టపడ్డారు కాబట్టే.. ఆ ఫ్రేమ్ అంతగా జనాల మనసుల్లోకి వెళ్లిపోయింది. సినిమా మొత్తానికి కీలకం అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/