Begin typing your search above and press return to search.
జైళ్ల ను మార్చనున్న యోగి... తెరపైకి 'ఓపెన్ జైలు'!
By: Tupaki Desk | 16 Jun 2023 5:05 PM ISTఆన్ లైన్ లోనూ ఆఫ్ లైన్ లో అన్నట్లుగా దూసుకుపోతున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూపీ లో వరుసగా రెండో సారి అధికారం లోకి వచ్చాక ఆయన పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా... తాజాగా జరిగిన జైళ్ల శాఖ సమీక్షలో అధికారుల కు కీలక ఆదేశాలు జారీచేశారు.
సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రం లో శాంతిభద్రత లతో పాటు నేరస్తుల విషయం లోనూ కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఈ సమయం లో తాజాగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జైళ్ల పరిస్థితిని సమీక్షించారు. జైళ్లలో చేపట్టాల్సిన సంస్కరణల కు సంబంధించి అధికారులకు రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఇదే సమయంలో జైళ్లను "సుధార్ ఘర్" (సంస్కరణ గృహాలు)గా మార్చాల్సిన అవసరాన్ని ఉందని గుర్తుచేశారు.
అయితే ప్రస్తుతం జైళ్లలో ఖైదీల కు 1894 జైళ్ల చట్టం, 1900 నాటి ఖైదీల చట్టం అమలు చేస్తున్నారు. ఈ రెండు చట్టాలు స్వతంత్రానికి పూర్వం నుండి అమల్లో ఉన్నాయి. దీంతో వీటిని మార్చాల్సిన అవసరం ఉందని యోగి నిర్ణయించుకున్నారు. ఫలితంగా.... యూపీ లో జైళ్లను సంస్కరణ కేంద్రాలుగా మార్చాలని, ఇందుకోసం అవసర మైన ప్రతి చర్యా తీసుకోవాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.
ఇదే సమయంలో ఖైదీల భద్రత, ఫిర్యాదుల పరిష్కారం, జైలు అభివృద్ధి మండలి, ఖైదీల ప్రవర్తనలో మార్పులతో పాటు మహిళా ఖైదీల కు, ట్రాన్స్ జెండర్ల కు ప్రత్యేక వసతి కల్పించడం వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ క్రమంలో... తాజాగా కేంద్రం మోడల్ జైలు చట్టం -2023ని ఇటీవల రూపొందించిన విషయాన్ని ప్రస్థావించిన ఆయన... ఖైదీల సంస్కరణ, పునరావాసం దృష్ట్యా ఈ మోడల్ చట్టం చాలా ఉపయోగకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే తరహా లో రాష్ట్ర అవసరాల ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కొత్త జైలు చట్టం తయారుచేయాలని సూచించారు.
ఈ దిశలో "ఓపెన్ జైలు" ఏర్పాటు ప్రయోగం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని యోగి అభిప్రాయపడ్డారు. కాగా... ప్రస్తుతం లక్నోలో సెమీ ఓపెన్ జైలు మాత్రమే ఉంది!