Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ కథ' నుంచి సెకండ్ మినీ సింగిల్ 'సామిరంగా' ప్రోమో..!

By:  Tupaki Desk   |   19 April 2021 8:41 AM GMT
ఏక్ మినీ కథ నుంచి సెకండ్ మినీ సింగిల్ సామిరంగా ప్రోమో..!
X
'వర్షం' ద‌ర్శ‌కుడు శోభ‌న్ కుమారుడు, 'పేపర్ బాయ్' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఏక్ మినీ కథ''. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషించారు. కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ స్టోరీ అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా వారు సమర్పిస్తున్నారు. 'డజ్‌ సైజ్‌ మ్యాటర్‌?' అంటూ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ - టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే 'ఈ మాయలో..' లిరికల్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో మరో మినీ సింగిల్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

'ఏక్ మినీ కథ' చిత్రం నుంచి 'సామిరంగా..' అనే పాట లిరికల్ వీడియోని ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 'సామి రంగా.. పరేషానీ జీవితం.. తస్సాదియ్యా.. ఊరుకోరే ఈ జనం.. పిల్లకన్నీ పెద్ద కలలే.. చిన్నబోయా నాలోనేనే..' అంటూ సాగిన ఈ పాటకు ప్రవీణ్ లక్కరాజు ట్యూన్ కంపోజ్ చేశారు. సినిమా నేపథ్యానికి తగ్గట్లు లిరిసిస్ట్ శ్రీజో సాహిత్యం అందించగా.. సింగర్ పృథ్వీ చంద్ర తనదైన శైలిలో అలపించారు. ఈ సందర్భంగా వదిలిన ఈ సాంగ్ ప్రోమో అలరోస్తోంది. ఇందులో బ్యాట్ సైజ్ చిన్నదని ఫీల్ అవుతున్న హీరోని హీరోయిన్ తో పాటుగా శ్రద్ధాదాస్ - బ్రహ్మాజీ - సుదర్శన్ టీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'ఏక్ మినీ కథ' చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు.