Begin typing your search above and press return to search.

సలార్ క్లైమాక్స్ నెవ్వ‌ర్ బిఫోర్ యాక్ష‌న్ ట్రీట్

By:  Tupaki Desk   |   30 Jan 2022 11:38 PM GMT
సలార్ క్లైమాక్స్ నెవ్వ‌ర్ బిఫోర్ యాక్ష‌న్ ట్రీట్
X
డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన సాహో అత్యంత భారీ కాన్వాస్ తో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ స్టంట్ సీన్స్ మాస్ ప్రియుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా నిలిచాయి. హిందీ బెల్ట్ లో సాహో ఘ‌న‌విజ‌యం సాధించ‌డానికి ఈ యాక్ష‌న్ ఎంత‌గానో ఉప‌క‌రించింది. ఇప్పుడు అంత‌కుమించి భారీ యాక్ష‌న్ తో స‌లార్ ని తెర‌కెక్కిస్తున్నారు ప్ర‌శాంత్ నీల్.

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ క్లైమాక్స్ ని ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ సైతం అత‌డు ఎంతో హార్డ్ హిట్టింగ్ యాక్ష‌న్ తో తెర‌కెక్కించార‌. ఇప్పుడు అంత‌కుమించి ప్ర‌భాస్ కోసం క్లైమాక్స్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేశార‌ని తెలిసింది.

ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న సాలార్ లో మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ కోసం రాజీ అన్న‌దే లేకుండా బ‌డ్జెట్ ని వెచ్చించార‌ని తెలిసింది. కేవలం క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే రూ.75 కోట్ల‌ నుండి 100 కోట్ల మేర‌ ఖర్చు చేస్తున్నార‌ని.. ఇది యాక్షన్ సినిమాల ప్రేమికులకు స్పెష‌ల్ ట్రీట్ గా నిలుస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది.

ఇక స‌లార్ ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నార‌న్న గుస‌గుస‌ల న‌డుమ ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. అయితే దీనిపై మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. సాలార్ లో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా.. హోంబాలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. రాధే శ్యామ్- ఆదిపురుష్ 3డి సినిమాల షూటింగులను ప్రభాస్ పూర్తి చేశాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఆదిపురుష్ 3డి భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ నేప‌థ్యంలోని సినిమా.