Begin typing your search above and press return to search.

30 సెకండ్లకే సాహో జక్కన్న అనాల్సిందే

By:  Tupaki Desk   |   22 April 2017 9:33 PM IST
30 సెకండ్లకే సాహో జక్కన్న అనాల్సిందే
X
బాహుబలి ది కంక్లూజన్ కోసం జనాలు ఇంతగా ఎందుకు వెయిట్ చేయాలని అనే ప్రశ్నకు.. ఓ చిన్న సమాధానం లభించింది. బాహుబలి2 ట్రైలర్ తో ఇప్పటికే ఈ మూవీ ఎలా ఉంటుందో చూపించిన రాజమౌళి.. ఇప్పుడు ఓ ప్రోమో సాంగ్ తో అందరూ నోళ్లు వెళ్లబెట్టేలా చేసేశాడు.

'సాహోరే బాహుబలి' పాటకు ఇప్పుడు ఓ ప్రోమో రిలీజ్ అయింది. కేవలం 30 సెకండ్ల పాటు ఉండే ఈ టీజర్ ను.. ఆద్యంతం అమరేంద్ర బాహుబలి పాత్ర ఎంత పవర్ ఫుల్ అనే విషయాన్ని తెలియచెప్పే విధంగానే కట్ చేయడం విశేషం. అసలు లిరిక్ రాసిందే బాహుబలి పాత్ర ఖ్యాతిని కీర్తించేది అయితే.. దానికి రాజమౌళి స్టైల్ మేకింగ్ జోడించాక విజువల్స్ ను చూస్తే.. కళ్లు తిప్పుకోవడమే కాదు రెప్ప వేయడం కూడా మర్చిపోవాల్సిందే. బాహుబలి పార్ట్ 1లో ప్రభాస్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లభించలేదని.. ప్రభాస్ అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూసినందుకు సంతృప్తి కలిగేలా లేదని విమర్శలు వినిపించాయి.

ఇప్పుడు సాహోరే బాహుబలి సాంగ్ టీజర్ చూస్తే.. అసలు ఆయుధానలన్నీ రెండో భాగం కోసం దాచిపెట్టేశాడనే విషయం అర్ధమవుతుంది. ఏనుగు తొండంతో విల్లు ఎక్కిపెట్టించడం లాంటి సీన్స్ చూస్తే ఒళ్లు గగుర్పొడిపించడమే కాదు.. బాహుబలి2 కోసం ఆరాటం పెరిగిపోవడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.