Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: సాహో విలన్ నెంబర్ 5

By:  Tupaki Desk   |   8 Aug 2019 10:12 AM GMT
ఫస్ట్ లుక్: సాహో విలన్ నెంబర్ 5
X
రోజుకో విలన్ ని పరిచయం చేస్తూ ఇంకెందరు ఉన్నారో అని ఉత్కంట కలిగేలా పోస్టర్లు వదులుతున్న సాహో టీం ఇవాళ జాకీ ష్రాఫ్ ని తీసుకొచ్చింది. మొత్తం క్యాస్టింగ్ లోనే సీనియర్ మోస్ట్ ప్రతినాయకుడైన జాకీ ఇటీవలే సాహో గురించి హీరో ప్రభాస్ గురించి చాలా ముచ్చట్లు చెప్పాడు. ఫైనల్ గా తన లుక్ కూడా రివీల్ అయ్యింది. సైడ్ కట్ లో స్టైలిష్ గా ఎక్స్ ప్రెషన్ ని కనిపించీ కనిపించనివ్వకుండా సెట్ చేసిన తీరు వెరైటీగా ఉంది.

తనకు ప్రభాస్ కు కనెక్షన్ ఏంటి అనే విషయం మాత్రం సస్పెన్స్. ఇప్పటిదాకా అరుణ్ విజయ్ - లాల్ - చుంకీ పాండే - నీల్ నితీష్ ల లుక్స్ తో రకరకాల విశ్లేషణలతో అంచనాలు వేసుకుంటున్న అభిమానులకు ఇప్పుడు జాకీ ష్రాఫ్ ఇంకో అదనపు బాద్యత అయ్యాడు. ఇంకా ఎందరు విలన్స్ రావాల్సి ఉందో యూనిట్ కె తెలియాలి. ఎల్లుండి ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్న నేపధ్యంలో ఈ పోస్టర్లు హైప్ ని పెంచుతున్నాయి.

ఆగస్ట్ 30 విడుదలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రీ బుకింగ్ హడావిడి మొదలుపెట్టేశారు. డార్లింగ్ ఫ్యాన్స్ హీరోకు గ్రాండ్ వెల్కం చెప్పేందుకు ధియేటర్ల దగ్గర ఏర్పాట్ల గురించి ప్లానింగ్ లో ఉన్నారు. శ్రద్ధా కపూర్ హీరొయిన్ గా నటించిన సాహోకు జీబ్రాన్ నేపధ్య సంగీతం అందించగా పాటలు మాత్రం ఒక్కో స్వరకర్త విడివిడిగా కంపోజ్ చేయడం విశేషం. ట్రైలర్ కు ఇంకో రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఇంకో ఇద్దరు విలన్లు రేపు ఎల్లుండి వస్తారేమో