Begin typing your search above and press return to search.

'సాహో' ఓవ‌ర్సీస్‌ హ‌క్కులు ఎవ‌రికి?

By:  Tupaki Desk   |   24 Oct 2018 5:28 AM GMT
సాహో ఓవ‌ర్సీస్‌ హ‌క్కులు ఎవ‌రికి?
X
ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే మునుపెన్న‌డూ చూడని భారీ యాక్ష‌న్ సినిమాని అందించేందుకు యు.వి.క్రియేష‌న్స్ రాజీ లేకుండా పెట్టుబ‌డులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో వంశీ - ప్ర‌మోద్ నిర్మిస్తున్న `సాహో` అంత‌కంత‌కు ఉత్కంఠ పెంచుతోంది. ప్ర‌భాస్ బ‌ర్త్‌ డే రోజు రిలీజైన మేకింగ్ వీడియో చాప్ట‌ర్ 1 ఉత్కంఠ పెంచింది. దుబాయ్‌ లో నెల రోజుల పాటు సాగిన చిత్రీక‌ర‌ణలో ఏ స్థాయి యాక్ష‌న్ సీన్స్ తీసారు అన్న‌ది ఈ విజువ‌ల్స్‌ లో చూపించారు.

మేకింగ్ వీడియో బాగానే వ‌ర్క‌వుటైంద‌ని తాజా అప్‌ డేట్ చెబుతోంది. తాజా మేకింగ్ వీడియో చూడ‌గానే ప్ర‌ముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీలు ప్ర‌స్తుతం యు.వి.క్రియేష‌న్స్ వెంట‌ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది. `సాహో` ఓవ‌ర్సీస్ డీల్ కోసం ప‌లు బాలీవుడ్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీల మ‌ధ్య పోటీ నెల‌కొందిట‌. ఓవ‌ర్సీస్‌ లో అన్ని భాషల్లో రిలీజ్ హ‌క్కుల కోసం రూ.50 కోట్ల నుంచి 60కోట్ల మేర డీల్ మాట్లాడుతున్నార‌న్న స‌మాచారం అందింది.

`సాహో` హిందీ రిలీజ్ హ‌క్కుల్ని ఇప్ప‌టికే టీసిరీస్‌కి విక్ర‌యించారు. ఈ డీల్ 60-90 కోట్ల మ‌ధ్య సాగింద‌న్న ప్ర‌చారం ఉంది. ఆ త‌ర్వాత సాహోకి సంబంధించి ఓవ‌ర్సీస్‌ అతి పెద్ద డీల్ కాబోతోందని అర్థ‌మ‌వుతోంది. మొత్తానికి `బాహుబ‌లి` ఇమేజ్ సాహో బిజినెస్ డీల్స్‌ కి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌నే సీన్ చెబుతోంది. ఇదే హుషారులో ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సాహో భారీ బిజినెస్ చేయ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ప‌లువురు బాలీవుడ్ క్రేజీ స్టార్ల‌కు త‌గ్గ‌ని రీతిలో ప్ర‌భాస్ సాహో బిజినెస్ రేంజు ఉంద‌న్న మాటా వినిపిస్తోంది. `సాహో` వ‌చ్చే వేసవికి రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.