Begin typing your search above and press return to search.

స్పైడర్ మ్యాన్ కు సాహో లింక్

By:  Tupaki Desk   |   14 Jun 2019 5:47 AM GMT
స్పైడర్ మ్యాన్ కు సాహో లింక్
X
మొత్తానికి నిన్న సాహో టీజర్ ని చెప్పిన టైంకి రిలీజ్ చేసి యువి సంస్థ అభిమానుల నెత్తిన పాలు పోసింది. యాక్షన్ ఫీస్ట్ లా అనిపించిన ఈ వీడియో ఇప్పటికే ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది. ఇదిలా ఉండగా త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న వార్త ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఉంది. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ జులై 1 నుంచి ట్రైలర్ ను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలు జరుగుతున్నాయట.

దీనికో కారణం ఉంది. వచ్చే నెల 5న స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రొం హోమ్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటిదాకా వచ్చిన సిరీస్ లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ గా చెప్పుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఇండియాలో కనివిని ఎరుగని స్థాయిలో స్క్రీన్లను కేటాయించబోతున్నారు. ఈ అవకాశాన్ని వాడుకుంటూ సాహో హిందీ నిర్మాణ సంస్థ స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రొం హోమ్ తో పాటు అదే రోజు నుంచే ప్రభాస్ సినిమా ట్రైలర్ ను ప్రదర్శించేలా యువి మీద ఒత్తిడి తెస్తున్నారట.

సాధారణంగా ట్రైలర్ అంటే ఎంత లేదన్నా రెండు నిమిషాలకు పైగానే ఉండాలి. కానీ చేతిలో కేవలం పదిహేను రోజులు మాత్రమే ఉన్నాయి. సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఓ పాట బాలన్స్ ఉంది. వీటి మీద ఫోకస్ పెట్టకుండా కేవలం స్పైడర్ మ్యాన్ తో అటాచ్ చేయడం కోసం ట్రైలర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. సరైన నిర్ణయమూ అనిపించుకోదు. దీనికి సంబంధించి ఓ రెండు మూడు రోజుల్లో నిర్ణయం చెబుతామని యువి ప్రతినిధులు చెప్పారట. ఒకవేళ నిజంగానే వస్తే మాత్రం డబుల్ బొనాంజా అని వేరే చెప్పాలా