Begin typing your search above and press return to search.

సాహో ఛాప్టర్‌ 2కు అంతా సిద్దం

By:  Tupaki Desk   |   24 Feb 2019 11:15 AM GMT
సాహో ఛాప్టర్‌ 2కు అంతా సిద్దం
X
'బాహుబలి' వంటి బిగ్గెస్ట్‌ సక్సెస్‌ తర్వాత ప్రభాస్‌ చేస్తున్న భారీ మూవీ 'సాహో'. ఈ చిత్రంను కూడా ప్రభాస్‌ భారీ బడ్జెట్‌ తో చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దాదాపు రెండేళ్లుగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌ రేంజ్‌ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యాక్షన్‌ సీన్స్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉంటాయని ఇప్పటికే విడుదలైన ఛాప్టర్‌ 1 వీడియో ద్వారా వెళ్లడైంది. త్వరలో ఛాప్టర్‌ 2 వీడియోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

ఛాప్టర్‌ 2 వీడియోను అతి త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారని 'సాహో' యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. మార్చి 3వ తారీకున 'సాహో' హీరోయిన్‌ శ్రద్దా పుట్టిన రోజు. ఆ సందర్బంగా ఛాప్టర్‌ 2 వీడియోను విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రభాస్‌ తో పాటు శ్రద్దా కీలకంగా కనిపించబోతుంది. శ్రద్దా చేసే యాక్షన్‌ సీన్స్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఛాప్టర్‌ 1లో ప్రభాస్‌ కు సంబంధించిన విజువల్స్‌ ను చూపించగా, రెండవ ఛాప్టర్‌ లో ప్రభాస్‌ మరియు శ్రద్దాల కాంబో షాట్స్‌ ను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఆగస్టులో సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యంలో మెల్ల మెల్లగా ప్రమోషన్‌ కార్యక్రమాలు స్పీడప్‌ చేయాలని సుజీత్‌ భావిస్తున్నాడు. అందుకే హీరోయిన్‌ పుట్టిన రోజున ఛాప్టర్‌ 2ను విడుదల చేయాలని నిర్ణయించారు.