Begin typing your search above and press return to search.

`అఆ`లో నాగ‌చైత‌న్య

By:  Tupaki Desk   |   1 Jun 2016 5:23 AM GMT
`అఆ`లో నాగ‌చైత‌న్య
X
అవునా..? నితిన్ సినిమాలో నాగ‌చైత‌న్య న‌టించాడా? అని ఆశ్చ‌ర్య‌పోకండి. `అఆ`లో నాగ‌చైత‌న్య న‌టించ‌లేదు. రేపు విడుద‌ల కాబోతున్న అఆ సినిమాతో పాటు నాగ‌చైత‌న్య `సాహ‌సం శ్వాస‌గా సాగిపో` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌వ‌బోతోంది. ఆ ర‌కంగా `అఆ` సినిమాలో చైతూ హంగామా చేస్తాడ‌న్న‌మాట‌. ఈ రోజు సాయంత్ర‌మే నాగ‌చైత‌న్య ఆన్‌ లైన్‌ లో ట్రైల‌ర్‌ ని విడుద‌ల చేయ‌బోతున్నాడు. రేపట్నుంచి అఆ థియేట‌ర్ల‌లోనూ ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. నాగ‌చైత‌న్య - మంజిమ మోహ‌న్ జంటగా న‌టించిన చిత్రం `సాహసం శ్వాస‌గా సాగిపో`. గౌత‌మ్‌మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చాలా రోజులుగా సెట్స్‌ పై ఉన్న ఈ చిత్రం గురించి అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు. కానీ గౌత‌మ్ మీన‌న్ మాత్రం సినిమాని ఎంత‌కీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం లేదు.

తెలుగు - త‌మిళ భాష‌ల్లో ఇద్ద‌రు క‌థానాయ‌కుల‌తో తెర‌కెక్కుతున్న చిత్రం కాబ‌ట్టి షూటింగ్‌ లో ఆల‌స్యం చోటు చేసుకొంటోంది. ఎట్ట‌కేల‌కి సినిమాని పూర్తి చేసిన గౌత‌మ్‌ మీన‌న్ త్వ‌ర‌లోనే విడుద‌ల చేద్దానుకుంటున్నాడు. మామూలుగా అయితే పాట‌ల విడుద‌ల వేడుక‌లోనే ట్రైల‌ర్‌ ని విడుద‌ల చేయాలి. కానీ ఇప్ప‌టికే ఆన్‌ లైన్‌ లో రెండు పాట‌ల్ని విడుద‌ల చేశారు కాబ‌ట్టి ఆ వేడుక ఉంటుందో లేదో డౌటే. అందుకే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ ని ఇలా విడుద‌ల చేస్తుండొచ్చు. ఎ.ఆర్‌.రెహమాన్ స్వ‌రాలు అందిస్తున్న సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాకి కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.