Begin typing your search above and press return to search.

యంగ్ మేక‌ర్ కి `భీమ్లా నాయ‌క్` ఛాన్స్ అలా!

By:  Tupaki Desk   |   26 Feb 2022 1:30 AM GMT
యంగ్ మేక‌ర్ కి `భీమ్లా నాయ‌క్` ఛాన్స్ అలా!
X
`భీమ్లా నాయ‌క్` చిత్రంతో సాగ‌ర్. కె. చంద్ర పేరు ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోయినా ప‌వ‌న్ సాగ‌ర్ ట్యాలెంట్ గుర్తించి ఈ అంకాశం క‌ల్పించారు. క‌మ్యునిజం భావాల‌పై సాగ‌ర్ కు ఉన్న ప‌ట్టు.. రైటింగ్ స్కిల్స్ న‌చ్చి ప‌వ‌న్ మెచ్చి ఇచ్చిన అవ‌కాశం ఇది.

మ‌రి ఈ అవ‌కాశానికి ఎలా బీజీ పడింది? సాగ‌ర్ చంద్ర నేప‌థ్యం ఏంటి? ద‌ర్శ‌కుడిగా ఎలా ట‌ర్న్ తీసుకున్నారు? వంటి విష‌యాలు తెలియాలంటే అస‌లు సంగ‌తుల్లోకి వెళ్లాల్సిందే.

సాగ‌ర్ . కె చంద్ర తొలుత ర‌విబాబు వ‌ద్ద స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసారు. అంత‌కు ముందు రైటింగ్ డిపార్ట్ మెంట్ లోనూ ప‌నిచేసారు. అయితే సాగ‌ర్ మంచి తెలివైన విద్యార్ధి. పుస్త‌కాల పురుగు. అందులోనూ క‌మ్యునిజం భావాలున్నా సామ్య‌వాద సిద్దాంతాల‌ప‌ట్ల మంచి ప‌ట్టున్న వ్య‌క్తి. ప‌వ‌న్ ని అక్క‌డే లాక్ చేసాడు.

కొన్నాళ్ల పాటు ర‌విబాబు వ‌ద్ద ప‌నిచేసిన సాగ‌ర్ త‌ర్వాత కాలంలో రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో `అయ్యారే` అనే సినిమా తెర‌కెక్కించారు. క‌మ‌ర్శియ‌ల్ గా ఈ సినిమా స‌క్సెస్ కాలేదు. కానీ ద‌ర్శ‌కుడిగా సాగ‌ర్ కి మంచి పేరు తీసుకొచ్చింది.

అటుపై నారా రోహిత్ -శ్రీ విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో `అప్ప‌ట్లో ఒక్క‌డుండేవాడు` చిత్రం తెర‌కెక్కించాడు. ఓ క్రికెట్ క్రీడాకురాడు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తెర‌కెక్కించారు. ఆద్యంతం బ‌యోపిక్ లా ఉంటుంది. ఆసినిమా తో ప‌రిశ్ర‌మ‌లో బాగా పేరు తెచ్చుకున్నాడు. వ‌సూళ్ల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే సాగ‌ర్ కి ఈ సినిమా ఎన‌లేని గుర్తింపుని తీసుకొచ్చింది.

ఈ సినిమా చూసే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలిచి మ‌రీ `భీమ్లా నాయ‌క్` అవ‌కాశం ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి వ్య‌క్తిగ‌తంగా సాగ‌ర్ ఐడియాల‌జీకి ద‌గ్గ‌ర ఉండ‌టం క‌లిసొచ్చింది. ప‌వ‌న్ లాంటి స్టార్ హీరో త‌న‌కి ప‌డితే పైకి వ‌స్తాడుని ప‌వ‌న్ అవ‌కాశం క‌ల్పిచారు.

అయితే ప‌వ‌న్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని క‌థ‌లో కొన్ని క‌మ‌ర్శియ‌ల్ అంశాలు జొప్పించాల‌ని కాబ‌ట్టి స్ర్కిప్ట్...డైలాగుల వ‌ర‌కూ త్రివిక్ర‌మ్ ని రంగంలోకి దించారు. ఇది ప‌వ‌న్ సేఫ్ సైడ్ కోసం ఆడిన గేమ్. మ‌రి ఇప్పుడు క్రెడిట్ ఎవ‌రికి ద‌క్కుతుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్ర‌మ్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. త‌ను ఉంటే సాగ‌ర్ ఫోక‌స్ కాడ‌ని ఏమో మాయావీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ముందుగా పెద్ద‌ల్ని ఉద్దేశించి మాట్లాడ‌టం వంటివి ప‌వ‌న్ సాగ‌ర్ కి చెవిలో చెప్ప‌డం చూస్తే అత‌న్ని ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నాల్లానే క‌నిపిస్తున్నాయి. మ‌రి సాగ‌ర్ టైమ్ ఎలా ఉంద‌న్నది చూడాలి. `భీమ్లా నాయ‌క్` మొద‌టి షో తోనే టాక్ అదిరిపోయింది. మంచి రివ్యూలు వ‌చ్చాయి. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అంటున్నారు. అదే నిజ‌మైతే సాగ‌ర్ కెరీర్ ట‌ర్న్ తీసుకున్న‌ట్లే . ప‌వ‌న్ అనుకున్న‌ది జ‌రుగుతుంది.