Begin typing your search above and press return to search.

ఎస్కే జాతిరత్నాలకు థమన్ వాయింపు షురూ

By:  Tupaki Desk   |   6 Jan 2022 6:40 AM GMT
ఎస్కే జాతిరత్నాలకు థమన్ వాయింపు షురూ
X
గత ఏడాది ఆరంభంలో జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్ పొలిశెట్టి.. అనుదీప్ లకు మంచి సక్సెస్ దక్కింది. ఇప్పుడు వారు ఇద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు. నవీన్ పొలిశెట్టి రెండు పెద్ద బ్యానర్‌ ల్లో సినిమాలు చేస్తున్నాడు. ఇక అనుదీప్‌ తమిళ ట్యాలెంటెడ్‌ హీరో మోస్ట్‌ క్రేజీ స్టార్‌ శివ కార్తికేయన్ తో మల్టీ ల్యాంగ్వేజ్ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. కొన్ని నెలల క్రితం వీరి కాంబో మూవీ పట్టాలెక్కబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇటీవలే సినిమా గురించిన అఫిషియల్‌ ప్రకటన వచ్చింది. రెండు రోజుల క్రితం అధికారిక ప్రకటన వచ్చిందో లేదో అప్పుడే సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు అయ్యాయి. నిన్న రాత్రి నుండి ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్‌ మొదలు పెట్టినట్లుగా యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

థమన్ ట్విట్టర్ లో శివ కార్తికేయన్‌.. అనుదీప్‌ మరియు నవీన్ పొలిశెట్టిలతో వర్క్‌ ను చాలా ఎంజాయ్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. కంటిన్యూస్ గా నవ్వుకుంటూనే ఉన్నట్లుగా పేర్కొన్నాడు. ఒక మంచి ఎంటర్‌ టైనర్ ను అనుదీప్ మరోసారి ప్రేక్షకులకు ఇవ్వబోతున్నట్లుగా థమన్ ట్వీట్‌ లో పేర్కొన్నాడు. తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉన్న శివ కార్తికేయన్ తో అనుదీప్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో నవీన్‌ పొలిశెట్టి పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం హాజరు అవ్వడం అనుమానలకు తావిస్తుంది. అనుదీప్‌ ను దర్శకుడిగా ప్రోత్సహించింది నవీన్ పొలిశెట్టి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆయన తదుపరి సినిమా విషయంలో కూడా నవీన్‌ సూచనలు ఉంటాయా అనే చర్చ జరుగుతుంది. కొందరు మాత్రం ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి కూడా ఉంటాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దర్శకుడిగా అనుదీప్ స్క్రిప్ట్‌.. ట్యూన్స్.. డైలాగ్స్ ఇలా అన్ని విషయాల్లో కూడా మరింత గా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఇద్దరి ముగ్గురి జడ్జ్‌ మెంట్‌ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా నవీన్‌ పొలిశెట్టిని కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కు ఆహ్వానించి ఉంటాడు అనేది ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్‌. అసలు విషయం ఏంటీ అనేది త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇక శివ కార్తికేయన్‌ తెలుగు లో మొదటి సారి నటిస్తున్న కారణంగా అందరి దృష్టి ఈ సినిమా పై ఉంది. కేవలం తమిళం.. తెలుగు లోనే కాకుండా ఇతర ఇండియన్ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

జాతిరత్నాలు వంటి ఒక పక్కా కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ ను అందించిన అనుదీప్‌ మరోసారి అలాంటి ఎంటర్‌ టైన్‌మెంట్‌ నే అందిస్తాడని థమన్‌ ట్వీట్‌ ద్వారా క్లారిటీ వచ్చింది. కనుక శివ కార్తికేయన్‌ పాత్ర ఎలా ఉంటుందా అంటూ ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇక నవీన్ పొలిశెట్టి యూవీ క్రియేషన్స్ మరియు సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌ ల్లో సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఇదే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. శివ కార్తికేయన్‌ మరియు అనుదీప్ ల మూవీ కూడా ఇదే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.