Begin typing your search above and press return to search.

ఈ కొత్తదనం సినిమాల్లో చూపించయ్యా

By:  Tupaki Desk   |   15 Feb 2016 9:00 PM IST
ఈ కొత్తదనం సినిమాల్లో చూపించయ్యా
X
తమన్‌ బాబు.. ఇప్పుడున్న స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్లు ఎవరంటే.. దేవిశ్రీప్రసాద్‌ తరువాత మనకు వినిపించే పేరు ఇదే. అయితే ఇతగాడు ఈ మధ్యన సరైన మ్యూజిక్‌ కొట్టట్లేదనేది వాస్తవం. అయితే పాత ట్యూన్లే కాస్త కొత్తగా వినిపిస్తున్నాడనేది మనోడిపై ఆరోపణ. లేదంటే ఏవైనా యురోపియన్‌ ఆల్బమ్స్‌ నుండి ఎత్తేస్తున్నాడని సోషల్‌ సైట్లలో దుమారమే లెగుస్తోంది.

సరే అదంతా పక్కనెట్టేస్తే ఇప్పుడు అమెరికాలో తన మ్యూజికల్‌ కాన్సర్ట్ ఒకటి ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నాడు. అక్కడ ఏకంగా ఎనిమిది నగరాల్లో మనోడు స్పెషల్‌ షో లు ఇస్తాడట. ఈ షో కోసం ఇప్పుడు ఒక టీజర్‌ రిలీజ్ చేశాడు. అందులో తమన్ బాబు డ్రమ్‌ వాయిస్తుంటే.. ఆ కిక్కు ఉంది చూడండి.. అబ్బో కేక. మనోడు కొత్తలో ఇలాగే కొత్తదనంతో ఆకట్టుకునేవాడు. ఇప్పుడు ఈ టీజర్‌ లో కూడా అలాంటి చురుకుదనమే చూపించాడు. ఇదేదో సినిమాల్లో చూపిస్తే ఎంత బాగుంటుందో నాయనా..

త్వరలోనే మన తమన్‌ ''సరైనోడు'' సినిమా ఆడియోతో రాబోతున్నాడు. ఈ మ్యూజిక్‌ ఆల్బమ్‌ ఎలా ఉండబోతోందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.