Begin typing your search above and press return to search.

ఆర్‌.ఎక్స్ హీరో కోటి డిమాండ్‌?

By:  Tupaki Desk   |   8 Sep 2018 4:38 AM GMT
ఆర్‌.ఎక్స్ హీరో కోటి డిమాండ్‌?
X
న‌టించిన తొలి సినిమానే బ్లాక్‌ బ‌స్ట‌ర్‌. నిర్మాత‌ల‌కు నాలుగు రెట్లు లాభాలు ద‌క్కాయి. ఈ హీరోలో విష‌యం ఉంద‌ని యూత్ డిక్లేర్ చేసేశారు. అంతేనా మీడియా ముందు ఆ హీరో మాట‌కారిత‌నం కూడా అంతే చ‌ర్చ‌కొచ్చింది. ఈయ‌న వాగ్ధాటి - సినిమాటిక్ అప్పియ‌రెన్స్ చూస్తుంటే .. చాలానే దూసుకెళ్లేట్టున్నాడు! అంటూ మాట్లాడుకున్నారు. అన్నంత ప‌నీ చేస్తున్నాడు. ఇప్ప‌టికిప్పుడు తెలుగు-త‌మిళ్ ద్విభాషా చిత్రాల‌కు స్కెచ్ వేశాడు. కోలీవుడ్‌ లో ప్ర‌స్తుతం ఓ క్రేజీ ఆఫ‌ర్‌ ను అందుకున్నాడు. ఆశించినంతా నిర్మాత‌ల నుంచి డిమాండ్ చేస్తున్నాడు. ఇంత‌కీ ఎవ‌రా హీరో అంటే ఆర్‌.ఎక్స్‌100 ఫేం కార్తికేయ‌.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లోనూ ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కార్తికేయ‌కు అవ‌కాశాలిచ్చేందుకు క్యూలో ఉన్నారు. అయితే స‌ద‌రు యువ‌హీరో నిర్మాత‌ల‌కు ఊహించ‌ని షాకిస్తున్నాడంటూ ఒక‌టే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కార్తికేయ ఒక్కో క‌మిట్‌ మెంట్‌ కు కోటి పారితోషికం డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. దీంతో నిర్మాత‌లు షాక్‌ కి గుర‌వుతున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. వ‌న్ ఫిలిం వండ‌ర్ కార్తికేయకు అంత రేంజుందా? అంటూ ఫిలింన‌గ‌ర్‌ లో ఆస‌క్తిక‌రంగా డిస్క‌ష‌న్ మొద‌లైంది.

మొద‌టి సినిమాతోనే బంప‌ర్ హిట్టు కొట్ట‌డం మాట అటుంచితే - కార్తికేయ‌ న‌టుడిగా నిరూపించుకున్నాడు. మాస్‌ లో దూసుకుపోయే స‌త్తా ఉంద‌ని నిరూపించాడు. అందుకే త‌న‌కు కోటి రేంజు ఉంద‌ని ఈ తెలుగు కుర్రాడు భావించి ఉండొచ్చు. ఇటీవ‌ల యువ‌హీరోల రేంజు పెరిగింది. తెలుగు సినిమా మార్కెట్ విస్తృతి రెట్టింపైంది. కంటెంట్ ఉంటే ఓవ‌ర్సీస్ - ఇరుగుపొరుగు నుంచే మినిమం 10కోట్లు వ‌సూలు చేసేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వ‌సూళ్లు బోన‌స్‌ గా నిలుస్తున్నాయి. అందుకే అత‌గాడు ఇన్ని లెక్క‌లు వేశాడ‌ని భావించ‌వ‌చ్చు.