Begin typing your search above and press return to search.

తొలి రోజే క‌లెక్ష‌న్లు ర‌య్ ర‌య్

By:  Tupaki Desk   |   13 July 2018 6:54 AM GMT
తొలి రోజే క‌లెక్ష‌న్లు ర‌య్ ర‌య్
X
నిన్ననే విడుద‌లైంది `ఆర్‌ .ఎక్స్‌.100`. ఆ సినిమా పేరుకు త‌గ్గ‌ట్టుగానే దాని క‌లెక్ష‌న్ల ర‌య్ ర‌య్‌ మంటూ దూసుకెళుతున్నాయి. తొలి రోజే స‌గం డ‌బ్బులు వ‌చ్చేసిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు తేల్చాయి. యూత్‌ ఫుల్ కంటెంట్‌ తో సినిమా తెర‌కెక్క‌డం... ట్రైల‌ర్లతోనే ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించేయ‌డంతో మంచి క్రేజ్ ఉన్న క‌థానాయ‌కుల సినిమాల్లాగే తొలి రోజు వ‌సూళ్లొచ్చాయి. ముఖ్యంగా హైద‌ర‌బాద్‌ - విజ‌య‌వాడ‌ - విశాఖ‌ప‌ట్నం - వ‌రంగ‌ల్‌ లాంటి మెట్రో న‌గ‌రాల్లో థియేట‌ర్లు హౌస్‌ ఫుల్‌ తో క‌నిపించాయి. బాక్సాఫీసు ద‌గ్గ‌ర అంతా యువ‌త‌ర‌మే క‌నిపించింది.

దాంతో తొలి రోజు మంచి వ‌సూళ్లొచ్చాయి. ఖ‌ర్చుల‌తో క‌లిపి 2.70 కోట్ల‌కు అమ్ముడైన సినిమాకి తొలి రోజు 1.41 కోట్లు షేర్లుగా వ‌చ్చాయి. ఈ లెక్క‌న తొలి రోజే స‌గం గిట్టుబాటైన‌ట్టు లెక్క‌. కీల‌క‌మైన వీకెండ్ ఈ రోజు నుంచే షురూ అవుతుంది కాబ‌ట్టి ఈ మూడు రోజులు మ‌రింత భీక‌రంగా వ‌సూళ్లొచ్చే అవ‌కాశాలున్నాయి. ఈ వారం గ‌డిస్తే ఈ సినిమా స్థాయేంటో అర్థ‌మ‌వుతుంది. మొత్తంగా `ఆర్‌.ఎక్స్‌.100` అటు మేక‌ర్స్‌ కీ... ఇటు బ‌య్య‌ర్ల‌కీ మంచి ప్రాఫిట‌బుల్ వెంచ‌ర్ అయింది. లాభాలు ఏ రేంజ్ అనేది ఈ రెండు రోజుల త‌ర్వాత ఖ‌రార‌వుతుంది. హీరో కార్తికేయ‌కి వ‌రుస‌కి బాబాయ్ అయిన అశోక్‌ రెడ్డి నిర్మాణంలోనే `ఆర్‌.ఎక్స్‌.100` తెర‌కెక్కింది. చిత్రంతో అటు హీరోకి క్రేజూ - ఇటు ఆయ‌న బాబాయ్‌ కి మంచి ప్రాఫిటూ ప‌క్కా అయ్యింది. అలాగే ఈ చిత్రంతో అజ‌య్‌ భూప‌తి రూపంలో ఓ మంచి ద‌ర్శ‌కుడు - పాయ‌ల్ రాజ్‌ పుత్ రూపంలో ఓ హాట్ భామ వెలుగులోకి వ‌చ్చిన‌ట్టైంది.