Begin typing your search above and press return to search.

RX 100 దర్శకుడికి డుండుం పీపీ!

By:  Tupaki Desk   |   11 Aug 2018 10:05 AM GMT
RX 100 దర్శకుడికి డుండుం పీపీ!
X
'RX 100' తో సెన్సేషనల్ హిట్ సాధించిన దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు టాలీవుడ్ లో ఒక క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. పెట్టుబడికి ఐదింతలు రాబడి తీసుకొస్తే ఇక నిర్మాతల కన్ను అయన పై పడకుండా ఉంటుందా? చాలామంది ప్రొడ్యూసర్లు అజయ్ భూపతితో సినిమా చేసేందుకు భారీ అడ్వాన్సు ముట్టజెప్పేందుకు రెడీ గా ఉన్నారట. అజయ్ మాత్రం మధు మంతెన ఫాంటమ్ ఫిలిమ్స్ బ్యానర్లో 'RX 100' సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఆ దిశలో ఇంకా చర్చలు జరుగుతున్నాయట.

ఇదిలా ఉంటే అజయ్ లైఫ్ లో మరో ముఖ్యమైన మార్పు డుండుం పీపీ ల రూపంలో రానుందట. అంటే ఎంటని అడక్కండి.. అజయ్ తన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ శిరీష ను ఆగష్టు 25 న పెళ్లి చేసుకొబోతున్నాడట. ఇది లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్ అట. అజయ్ చేసుకోబోతున్న అమ్మాయి బీటెక్ గ్రాడ్యుయేట్ అని సమాచారం. పెళ్లి హైదరాబాద్ లోనే జరుగుతుందట. ఈ లెక్కన అజయ్ కు 2018 ఒక మరపురాని సంవత్సరంగా ఉండబోతుంది.

ఇక పెళ్లికి రెండు వారాల సమయమే ఉంది కాబట్టి, అజయ్ నెక్స్ట్ సినిమా ప్రకటన రాబోయేది పెళ్లి తర్వాతే అయి ఉంటుంది. అంటే సెప్టెంబర్ లో ఈ సెన్సేషనల్ దర్శకుడి సెకండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియాలంటే ప్రేక్షకులు వచ్చే నెల వరకూ వెయిట్ చెయ్యక తప్పదు.