Begin typing your search above and press return to search.

RX 100 రచ్చ 9వ రోజు కూడా కంటిన్యూ!

By:  Tupaki Desk   |   21 July 2018 1:45 PM GMT
RX 100 రచ్చ 9వ రోజు కూడా కంటిన్యూ!
X
కొన్ని సినిమాలంతే.. రిలీజ్ కు ముందునుంచే పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. ఒక్కసారి రిలీజ్ అయితే వాటిని ఆపడం ఎవ్వరి తరం కాదు. నూతన దర్శకుడు అజయ్ భూపతి నూతన నటులతో తెరకెక్కించిన RX 100 అలాంటి ఒక సినిమానే. బోల్డ్ టీజర్ - ట్రైలర్ల తో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండే హౌస్ ఫుల్ బోర్డుల దుమ్ము దులిపింది.

రెండో రోజుకే సినిమాపై పెట్టిన పెట్టుబడిని వెనక్కు తీసుకొచ్చిన ఈ రా లవ్ స్టొరీ ఇంకా ప్రేక్షకుల్ని థియేటరలకు ఇంకా రా రమ్మని పిలుస్తూనే ఉంది. వాళ్ళు కూడా సరే అంటూ వెళ్తూనే ఉన్నారు.. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ RX 100 ఇంకా ఫోర్త్ గేర్ లోనే ఉందంటే మనం ఈ సినిమా సక్సెస్ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. 9 వరోజున తెలుగు రాష్ట్రాల్లో 34 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది. దీంతో 9 రోజుల కలెక్షన్లు 8.41 కోట్లకు చేరాయి.

ఒక్క సారి ఏరియా వైజ్ కలెక్షన్స్ పై ఓ లుక్కేయండి. కొడవలినిండా కుంకుమ పూలే.. కడవల నిండా మందారాలే.. కౌంటర్ల నిండా రూపాయలే..!

నైజామ్ 4.04 cr
సీడెడ్ 1.02 cr
ఉత్తరాంధ్ర 0.93 cr
గుంటూరు 0.53 cr
ఈస్ట్ 0.65 cr
వెస్ట్ 0.50 cr
కృష్ణ 0.54 cr
నెల్లూరు 0.20 cr

టోటల్ 8.41 cr (ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ )