Begin typing your search above and press return to search.

మరోటి లైన్లో పెట్టిన అరెక్స్ హీరో!

By:  Tupaki Desk   |   16 Oct 2018 10:20 AM GMT
మరోటి లైన్లో పెట్టిన అరెక్స్ హీరో!
X
డెబ్యూ సినిమాతోనే హిట్ సాధించడం.. ప్రేక్షకుల గుర్తింపుకు నోచుకోవడం అందరికీ సాధ్యం కాదు. చాలా తక్కువమంది హీరోల విషయంలోనే అలా జరుగుతుంది. యంగ్ హీరో కార్తికేయ కు 'RX100' రూపంలో లాంటి డ్రీమ్ డెబ్యూ లభించింది. సినిమా సెన్సేషనల్ హిట్ సాధించడమే కాకుండా లుక్స్.. పెర్ఫార్మన్స్ విషయంలో కార్తికేయకు మంచి మార్కులు వచ్చాయి. దీంతో కార్తికేయ తో సినిమా చేసేందుకు పలువు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

ఇప్పటికే కార్తికేయ రెండో సినిమా లాక్ అయింది. 'హిప్పీ' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ తమిళ - తెలుగు ద్విభాషా చిత్రానికి దర్శకుడు TN కృష్ణ. ఈ సినిమాను కలైపులి థాను నిర్మిస్తున్నాడట. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కన్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుంది. తన సినిమా సెట్స్ మీదకు వెళ్ళకమునుపే కార్తికేయ మరో సినిమాను లైన్ లో పెట్టాడట. ఈసారి సీరియస్ సినిమా కాదట.. అదో ఎంటర్టైనర్ స్టొరీ అని సమాచారం.

ఈ సినిమాతో మల్లిఖార్జున్ అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. 'జయ జానకి నాయక'.. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాల నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ జోరుగా సాగుతోందని.. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా RX100 హీరో కార్తికేయ ఫుల్ స్పీడ్ లో ఉన్నట్టు అనిపిస్తోంది కదా?