Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఆరెక్స్ భామ అపరిచితురాలు కోణం!

By:  Tupaki Desk   |   8 Feb 2019 12:22 PM GMT
ఫోటో స్టొరీ: ఆరెక్స్ భామ అపరిచితురాలు కోణం!
X
గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాలలో 'RX100' ఒకటి. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఒక్కసారిగా క్రేజీగా మారిపోయింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో మంచి నటన కనబరచడమే కాకుండా.. హీరో కార్తికేయకు బోల్డు బోల్డ్ లిప్పు లాకులిచ్చి యూత్ కు కిక్కెక్కించింది. ఆసంగతి అలా ఉంటే పాయల్ సోషల్ మీడియా విషయంలో చాలా యాక్టివ్.. తరచుగా అప్డేట్లు ఇస్తూ ఈ జెనరేషన్ హీరోయిన్ అనిపించుకుంటుంది.

ఆమె బోల్డ్ ఫోటోల సంగతి మనకు ఎలాగూ మనకు తెలుసు కదా. ఈ హాటు పాపకు జనాలకు తెలియని మరో షేడ్ ఉంది. ఆ షేడ్ ఏంటంటే పాయల్ యానిమల్ లవర్. ఈ పదం వినగానే 'టెంపర్' లో ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ మనకంటే పెద్ద యానిమల్ ఎవరున్నారని అంటాడు కదా.. ఆ డైలాగ్ చెప్పకండి. అలాంటి యానిమల్ లవర్ కాదులెండి. ఏదో పాయల్ రేంజ్ కి తగ్గట్టుగా పంది పిల్లలను ప్రేమిస్తుందట. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "నాకు పందులంటే ప్రేమని చెప్పా.. అందరూ ఈ క్యూట్ పంది పిల్లతో పోలుస్తున్నారు. అందుకనే ఈ క్యూటీతో కలిసి నా ట్విన్నింగ్ పిక్ ను పోస్ట్ చేస్తున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఫోటోలో పైన పాయల్ ఒక క్యాప్ పెట్టుకొని పింక్ కలర్ లిప్ స్టిక్ వేసుకొని పందిమూతి పోజిచ్చింది. కిందేమో నిజం పందిపిల్ల ఎవరిలాగానో కాకుండా దాని పింక్ కలర్ మూతిని అది సగర్వంగా చూపిస్తూ పోజిచ్చింది. హాటు బ్యూటీలు ఎప్పుడూ ఏవేవో చూపించే ఈ ఇన్స్టాగ్రామ్ లో ఇలా పందిమూతి పోజు.. నిజం పంది పిల్ల సంచలనమే అబ్బా..!