Begin typing your search above and press return to search.

కుర్ర‌హీరోతో పాయ‌ల్ ఫిక‌ర్

By:  Tupaki Desk   |   4 Jan 2019 8:02 AM GMT
కుర్ర‌హీరోతో పాయ‌ల్ ఫిక‌ర్
X
ఒకే ఒక్క సినిమాతో సౌత్ లో అసాధార‌ణ పాపులారిటీ తెచ్చుకుంది పాయ‌ల్ రాజ్ పుత్. ఈ పంజాబీ బ్యూటీ అంద‌చందాల‌కు యూత్ ఫిదా అయిపోయారు. అంత‌కుమించి పాయ‌ల్ డేరింగ్ అండ్ గ‌ట్సీ యాటిట్యూడ్‌ కు గుండెల్లో గుడి క‌ట్టేశారు. ఆర్‌ఎక్స్ 100 గ్రాండ్ స‌క్సెస్ పాయ‌ల్ జాత‌క‌మే మార్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు, అటు కోలీవుడ్ లోనూ పాయ‌ల్ దూసుకుపోతోంది. అక్క‌డ ఉద‌య‌నిధి స్టాలిన్ లాంటి యంగ్ హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది.

ప్ర‌స్తుతం ఉద‌య‌నిధితో క‌లిసి ఆన్ లొకేష‌న్ ఈ బ్యూటీ చేస్తున్న సంద‌డి మామూలుగా లేదు. త‌మిళ చిత్రం ఏంజెల్ షూటింగ్ తో బిజీ అంటూ పాయ‌ల్ తాజాగా ఓ వీడియోని ఇన్ స్టాగ్ర‌మ్‌లో అప్ లోడ్ చేసింది. హాయ్ ఉద‌య్‌.. షూటింగ్ ఫ‌ర్ ఏంజెల్! అంటూ ఛీర్స్ చేసింది. మొత్తానికి పాయ‌ల్ జోరు చూస్తుంటే, ఇప్ప‌ట్లో ఎక్క‌డా త‌గ్గేట్టే క‌నిపించ‌డం లేదు.

ఎన్టీఆర్- క‌థానాయ‌కుడు చిత్రంలో జ‌య‌సుధ పాత్ర‌లో పాయ‌ల్ న‌టిస్తోంది. దీతో పాటు భానుశంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో న‌టించ‌నుంది. ఇరువార్ ఉల్ల‌మ్ అనే త‌మిళ చిత్రంలో, ఇష్కా అనే పంజాబీ చిత్రంలోనూ పాయ‌ల్ న‌టిస్తోంది. ఇప్ప‌టికే పంజాబీలో అర‌డ‌జ‌ను చిత్రాల్లో న‌టించిన మేటి క‌థానాయిక‌గా వెలిగిపోతోంది పాయ‌ల్. ఇక‌పై అగ్ర హీరోల చిత్రాల్లోనూ న‌టించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.