Begin typing your search above and press return to search.

'ఆర్ఎక్స్100' బాలీవుడ్ రీమేక్ ఫస్ట్ లుక్ విడుదల!

By:  Tupaki Desk   |   2 March 2021 6:33 AM GMT
ఆర్ఎక్స్100 బాలీవుడ్ రీమేక్ ఫస్ట్ లుక్ విడుదల!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో 'ఆర్ఎక్స్100' మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా బాలీవుడ్ రీమేక్ సిద్ధం అవుతోంది. తెలుగులో కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ బోల్డ్ మెసేజ్ మూవీ సూపర్ హిట్ అవ్వడమే గాక పాయల్ నటనకు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకేక్కించి సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటడానికి ఆర్ఎక్స్100 రీమేక్ రంగం సిద్ధమైంది. 'తడప్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి హీరోగా పరిచయం అవుతున్నాడు.

బోల్డ్ హీరోయిన్ పాత్రలో తారా సుతారియా నటిస్తోంది. అయితే తాజాగా మేకర్స్ తడప్ మూవీ ఫస్ట్ లుక్కుతో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారు. 2021 సెప్టెంబర్ 24న విడుదల కాబోతున్న తడప్ మూవీ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ ఫస్ట్ లుక్కులో హీరో గాయాలతో హీరోయిన్ను గాఢంగా కౌగిలించుకొని ఉండటం మనం చూడవచ్చు. తారా సుతారియా గట్టిగా హీరోను పట్టుకొని ఉంది. అయితే ఇక్కడ హీరో ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు మేకర్స్. 'ఇంక్రిడబుల్ లవ్ స్టోరీ' అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు మిలన్ లుత్రియా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సాజిద్ నదియాద్వాలా నిర్మిస్తుండటం విశేషం. మరి తెలుగులో కంటే బాలీవుడ్ లో బోల్డ్ నెస్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి.. సినిమాలో హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఆసక్తిని కనబరుస్తున్నారు ఆడియన్స్. చూడాలి మరి ఆర్ఎక్స్100కు బాలీవుడ్ లో ఎంతవరకు న్యాయం చేస్తారో!