Begin typing your search above and press return to search.

రన్.. రన్నింగ్ రేస్ ఫెయిలేనా?

By:  Tupaki Desk   |   24 March 2016 10:30 PM GMT
రన్.. రన్నింగ్ రేస్ ఫెయిలేనా?
X
సందీప్ కిషన్ - అనీషా అంబ్రోస్ లతో అని కన్నెగంటి తీసిన రన్ మూవీ.. అనుకున్న రిజల్ట్ సాధించడంలో విఫలమైంది. పండుగ సెలవలు - స్కూల్స్ కి హాలిడేస్ ఉన్నా.. ఈ మూవీ కనీస ఓపెనింగులు కూడా సాధించలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం ఎండలు బాగా మండుతుండడతో.. ఈవెనింగ్ షోస్ మీద మేకర్స్ బాగా ఆశలు పెట్టుకున్నారు. కనీసం అవయినా ఫుల్స్ అవుతాయని నిర్మాతలు భావించారు. రన్ మూవీ విడుదల రోజే ఇండియా-బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ ఉండడంతో.. కనీసం అవి కూడా నిండని పరిస్థితి నెలకొంది.

నిజానికి రన్ చిత్రం కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ నేరంకు రీమేక్. అక్కడ భారీ కలెక్షన్స్ రాబట్టినా.. తెలుగుకు వచ్చేసరికి ఆ మ్యాజిక్ పని చేయలేదు. ఒరిజినల్ వెర్షన్ స్క్రీన్ ప్లేను యాజిటీజ్ గా దింపేసినా.. ఫలితం మాత్రం ఆ రేంజ్ లో లేదనే విషయం స్పష్టమైపోతోంది. దీనికి కారణం.. అక్కడ పండినంతగా ఇక్కడ కామెడీ పండకపోవడమే అని చెప్పాలి.

ఇప్పటికే లాంగ్ గ్యాప్ తీసుకున్న సందీప్ కిషన్.. రన్ మూవీ ద్వారా తిరిగి ఫామ్ లోకి రావాలని ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ కుర్ర హీరో కలలు తీరాలంటే మరో మంచి మూవీ వచ్చేవరకూ ఎదురుచూడాల్సిందే. ఎందుకంటే.. ఇప్పుడు భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఊపిరి మార్చ్ 25న రిలీజ్ అవుతోంది. ఈ నాగ్, కార్తీల మల్టీ స్టారర్ కి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. రన్ పరిస్థితి మరీ దారుణంగా మారిపోయే ఛాన్సులు ఉన్నాయి.