Begin typing your search above and press return to search.

'యు'తో రన్నింగ్‌ ఎలా ఉండబోతుందో

By:  Tupaki Desk   |   21 March 2016 3:39 PM GMT
యుతో రన్నింగ్‌ ఎలా ఉండబోతుందో
X
సందీప్‌ కిషన్‌. సడన్‌ గా కాదు కాని.. కాస్త కష్టపడే స్టార్‌ అయ్యాడు. అయితే అనుకున్నంత రేంజ్‌ ను మాత్రం అందుకోలేకపోతున్నాడు. దానికి కారణం కన్సిస్టెంట్‌ గా మనోడు హిట్లు కొట్టలేకపోవడమే. అందుకే ఎల్లుండ రిలీజ్‌ కాబోయే ''రన్‌'' సినిమాపై మనోడు చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఇవాళే సెన్సార్‌ కార్యక్రమాలకు వెళ్ళిన ఈ సినిమా ''యు'' సర్టిఫికేట్ తో బయటకొచ్చింది. అయితే డార్క్‌ కామెడీ అన్నారు మరి ఇలా 'యు' సర్టిఫికేట్‌ వచ్చిందేంటో. తమిళంలో వచ్చిన ''నేరం'' సినిమాకు ఈ సినిమా రీమేక్‌. అక్కడా సినిమా స్లీపర్‌ హిట్‌. కాకపోతే ఈ సినిమా తరహాలో మన దగ్గర స్వామి రారా నుండి భలే మంచి రోజు వరకు చాలా సినిమాలే వచ్చాయి . మరి ఇలాంటి సమయంలో ''నేరం'' ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సందీప్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్‌ హీరోయిన్. మిష్టర్‌ నూకయ్య సినిమాను తీసిన అనిల్‌ ఎలియాస్‌ అని కన్నెగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 23నే రిలీజ్‌. సినిమాను మీడియాలో కంటే.. పరీక్షలు దగ్గర పడుతున్నా కూడా కాలేజీల దగ్గరకు వెళ్లి మరీ మా సినిమాను చూడండే అంటూ ప్రమోట్‌ చేస్తున్నాడు సందీప్‌. అది సంగతి.