Begin typing your search above and press return to search.

మరో లేడీ విలన్‌ తో స్టార్‌ హీరో ఢీ

By:  Tupaki Desk   |   28 Jun 2020 8:10 AM GMT
మరో లేడీ విలన్‌ తో స్టార్‌ హీరో ఢీ
X
తమిళ స్టార్‌ హీరో విశాల్‌ సినిమాల సక్సెస్‌ ఫ్లాప్స్‌ తో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న చిత్రం ‘చక్ర’. గతంలో విశాల్‌ చేసిన ఇరుంబు తిరై చిత్రానికి చక్ర కొనసాగింపు అనే వార్తలు వస్తున్నాయి. ఇరుంబు తిరై చిత్రంలో జనాల డేటాను దొంగిలించి దాని ద్వారా వారి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును కాజేయడం కథ. అర్జున్‌ ఆ సినిమాలో విలన్‌ గా నటించాడు. ఇప్పుడు ఆ సినిమా కథాంశం మాదిరిగానే చక్ర కూడా ఉంటుందని తాజాగా విడుదలైన టీజర్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది.

గతంలో వరలక్ష్మిని తన ఒక సినిమాలో విలన్‌ గా నటింపజేసిన విశాల్‌ ఈసారి మరో లేడీ విలన్‌ ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. చక్ర చిత్రంలో విలన్‌ పాత్రలో రెజీనా నటిస్తుందట. ఇప్పటి వరకు ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. తమిళ మీడియాలో మాత్రం ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది. చక్ర సినిమాకు రెజీనా నటన హైలైట్‌ గా ఉంటుందని కూడా వారు అంటున్నారు.

విశాల్‌ కు జోడీగా శ్రద్దా శ్రీనాధ్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నటిస్తోంది. సినిమా ప్రమోషన్‌ లో మరియు వీడియోల్లో రెజీనా ఈ చిత్రంలో నటించిన విషయాన్ని రివీల్‌ చేయకుండా సస్పెన్స్‌ ను మెయింటెన్‌ చేయాలనుకుంటున్నారట. సినిమా సెకండ్‌ హాఫ్‌ వరకు విలన్‌ ఎవరు అనే విషయంలో సస్పెన్స్‌ కొనసాగి ఆ తర్వాత విలన్‌ రెజీనా అంటూ రివీల్‌ చేస్తారట. ఇరుంబు తిరై చిత్రం సక్సెస్‌ అవ్వడంతో ఈ చిత్రంపై కూడా తమిళ తంబీలు అంచనాలు పెట్టుకున్నారు. చక్ర టైటిల్‌ తోనే తెలుగులో కూడా ఈ చిత్రంను విడుదల చేయనున్నారు.