Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో సమంత.. వాట్ ఏ జోక్

By:  Tupaki Desk   |   31 Jan 2018 12:30 PM IST
ఎన్నికల్లో సమంత.. వాట్ ఏ జోక్
X
సినిమాలకు రాజకీయాలకు బోలెడంత లింక్ ఉన్న మాట అయితే నిజమే. దక్షిణాదిలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంటుంది. చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడా జాబితాలోకి టాలీవుడ్ బ్యూటీ సమంతను కూడా చేర్చేశారు కొంతమంది రూమర్ రాయుళ్లు. వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ ఎన్నికలలో సమంతను పోటీ నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఓ రూమర్ బయలుదేరింది. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీలో నిలపాలని టీఆర్ ఎస్ సర్కారు ప్రయత్నిస్తోందని.. ఇప్పటికే అక్కినేని నాగార్జునతో కూడా చర్చలు నిర్వహించేశారని.. ఆయన సమ్మతించేశారని ఈ గాలి వార్తలు వినిపిస్తున్న కబుర్లు. ఇందుకు ఆమె మతాన్ని కూడా సాక్ష్యంగా చూపిస్తున్నారు. పైగా గతంలో జయసుధ పోటీ చేసి గెలిచిన ప్రాంతం కావడంతో సమంత కూడా గెలిచే అవకాశాలు ఎక్కువే అని విశ్లేషించేశారు కూడా.

దీనిలో వాస్తవాలు ఎంత అని ఆరా తీసినవారికి.. ఇదో సిల్లీ రూమర్ అని నవ్వేస్తున్నారట అక్కినేని అండ్ టీం. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ పడే ఉద్దేశ్యం తమ కుటుంబంలో ఎవరికీ లేదని తేల్చేస్తున్నారట. సినిమాల్లో సుదీర్ఘంగా కొనసాగే ఆలోచన ఉన్న సమంత.. ఎట్టి పరిస్థితుల్లోను పాలిటిక్స్ అడుగుపెట్టే ఛాన్స్ లేదన్నది సన్నిహితులు చెబుతున్న మాట.