Begin typing your search above and press return to search.

ప్చ్.. ఆ అమ్మాయి గురించి రూమరే

By:  Tupaki Desk   |   17 Sep 2016 7:10 AM GMT
ప్చ్.. ఆ అమ్మాయి గురించి రూమరే
X
యాంగ్రీ హీరో రాజశేఖర్- జీవితల కూతురు శివాని సినీ అరంగేట్రంపై బోలెడన్ని వార్తలు వచ్చేస్తున్నాయి. నాగశౌర్య హీరోగా నటించే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని.. సాయి కొర్రపాటి ఈ మూవీని నిర్మించనున్నాడని.. హాట్ న్యూస్ బాగానే హల్ చల్ చేసింది. అయితే.. హీరోయిన్ గా శివాని ఎంట్రీపై జీవిత క్లారిటీ ఇచ్చేసింది.

'నా కూతురు ఖచ్చితంగా ఓ నటిగా అరంగేట్రం చేస్తుంి. కానీ ఇప్పటికైతే ఇంకా ఏదీ ఫైనల్ కాలేలుద. ఒకవేళ ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తే తప్పనిసరిగా పరిశీలిస్తాం' అని చెప్పింది మాజీ హీరోయిన్ జీవిత. నిర్మాత సాయి కొర్రపాటి కూడా.. ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించాడు. 'నాగ శౌర్య హీరోగా కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నాను. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే.. హీరోయిన్ విషయంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు.. ఎవరినీ సంప్రదించలేదు' అని చెబుతున్నాడు సాయి కొర్రపాటి.

శివాని హీరోయిన్ ఎంట్రీ అంటూ వార్తలు వచ్చీ రాగానే.. కన్నతల్లే ఖండిచేయడంతో ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. అయితే.. తమ కూతురు ఖచ్చితంగా హీరోయిన్ అవుతుందని జీవిత చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.