Begin typing your search above and press return to search.

ఆ సినిమాటోగ్రాఫర్ చుట్టూ రూమర్లెందుకు?

By:  Tupaki Desk   |   25 Jan 2018 5:30 PM GMT
ఆ సినిమాటోగ్రాఫర్ చుట్టూ రూమర్లెందుకు?
X

అనుష్క భాగమతి సినిమా ఇప్పటివరకు సినిమా ఎలా ఉంటుంది అనే విషయంపైనే ఎక్కువగా రూమర్స్ వచ్చాయి గాని నెగిటివ్ గా మాత్రం ఎలాంటి వార్తలు రాలేవు. కానీ ప్రస్తుతం నమ్మలేని అనుమానం ఒకటి ప్రముఖ మీడియాల్లో బలంగా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న భాగమతి వెనకాల ఇంత కథ ఉందా అని ఓ వర్గం వారు నమ్మకుండా ఉండలేకపోతున్నారు.

భాగమతి సినిమాను మొదట స్టార్ట్ చేసింది దర్శకుడు అశోక్ కాదని తెలుస్తోంది. ముందుగా సినిమాటోగ్రాఫర్ కథను సెట్స్ పైకి తీసుకువచ్చాడని. అయితే దర్శకలోపం వల్ల యూవీ క్రియేషన్స్ అతన్ని మార్చేసిందని కథనాలు వెలువడుతున్నాయి.ఆ సినిమాటో గ్రాఫర్ మరెవరో కాదు యూవీ సినిమాలకు పనిచేస్తూ వస్తోన్న ఆర్.మది అనే చెప్పాలి. మిర్చి - రన్ రాజా రన్ సినిమాలకు ఇతనే సినిమాటోగ్రఫీ చేశాడు. అలాగే భాగమతికి కూడా ఇక సాహో సినిమాకు కూడా వర్క్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాటోగ్రాఫర్ ఎక్కడున్నా ఇవే రూమర్లు వస్తున్నాయి. గతంలో మిర్చి సినిమాను ఇతనే తీశాడని అన్నారు. అది కొరటాల డెబ్యూ సినిమా కాబట్టి అందరూ నిజమనే అనుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి భాగమతి సినిమాకంటూ టాక్ వచ్చింది. అయితే మనోడు కాస్త ఎక్కువగా మాట్లాడతాడట. డైరక్టర్ కే కాదు.. నటులకు కూడా ఆన్ ది స్పాట్ సూచనలు ఇచ్చేస్తుంటాడట. అందుకే అందరూ ఇలా అతనే డైరక్ట్ చేశాడు అనే రూమర్లకు తెరలేపుతున్నారని అంటున్నారు సన్నిహితులు.