Begin typing your search above and press return to search.

జై లవ కుశ.. అవన్నీ రూమర్లే

By:  Tupaki Desk   |   15 Sept 2017 11:23 AM IST
జై లవ కుశ.. అవన్నీ రూమర్లే
X
ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవ కుశ రిలీజ్ కి రెడీ అయిపోయింది. వచ్చే వారంలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి. దీంతో సినిమా టాక్ పై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సెన్సార్ టాక్ అంటూ సినిమాలో కీలకం అంటూ.. కొన్ని రకాల ప్రచారాలను చేస్తున్నారు.

ఈ సినిమాలో పొలిటికల్ పంచులు బాగా దట్టించారన్నది వాటి సారాంశం. జై పాత్రతో ఏపీలోని పాలిటిక్స్ పై నేరుగాను.. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గాను డైలాగ్స్ ఉన్నాయని.. వాటిలో కొన్నిటిని సెన్సార్ టీం మ్యూట్ చేసిందని కూడా చెబుతున్నారు. అయితే.. ఇవన్నీ రూమర్లేనని.. వీటిలో వాస్తవం ఉండకపోవచ్చని చెప్పచ్చు. రీసెంట్ గా బాలయ్య మూవీ పైసా వసూల్ రిలీజ్ సమయంలో కూడా ఇలాంటి టాక్ బాగానే నడించింది. పూరీ స్టైల్ లో ఈ పంచ్ లు ఉంటాయని అన్నారు. కానీ సినిమాలో మాత్రం అవేమీ లేవు.

ఇప్పుడు జై లవకుశ లో కూడా పాలిటిక్స్ లింక్ ఉండకపోవచ్చు. ఇది పక్కా మాస్ ఎంటర్టెయినర్. పైగా ఎన్టీఆర్ ఈ సినిమాను తన నట విశ్వరూపం చూపించాలనే తపనతో చేస్తున్నాడు. నిర్మాత కళ్యాణ్ రామ్ ను ఆర్థికంగా ఒడ్డున పడేయడంలో ఈ చిత్రం విజయం కీలకం. అలాంటి సమయంలో.. ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ లు ఎలాంటి రిస్క్ లు చేయకపోవచ్చు.