Begin typing your search above and press return to search.
అసలు టబు కాదు కదా.. ఎవరూ లేరు
By: Tupaki Desk | 2 Nov 2017 5:31 PM ISTఒక సినిమాను మొదలు పెడితే దర్శకుడికి హీరోకి ఎన్నో సంభాషణలు జరుగుతాయన్న విషయం అందరికి తెలిసిందే. అయితే కొంత మంది హీరోలు డైరెక్టర్ ఏం చెబితే అది చెయ్యడానికి రెడీ అంటారు మరికొంత మంది హీరోలు వారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే భయంతో గాని లేక ఆ చిన్న విషయంలో మనం ఎందుకు సలహా ఇవ్వకూడదు అనే ఆలోచనతో దీర్గంగా చర్చలు జరుపుతారు. అయితే ఒక్కోసారి అవి సక్సెస్ అవ్వొచ్చు కాకపోవచ్చు.
ఇటువంటి విషయాల్లో దర్శకులు కాస్త అసంతృప్తితోనే ఉంటారు. కష్టపడి రాసుకున్న కథలో ఏ చిన్న కరెక్షన్ చేయమన్నా సీనియర్ దర్శకులు కొంచెం హర్ట్ అవుతారు. దీంతో ఒక్కోసారి విభేదాలు కూడా రావొచ్చు. ప్రస్తుతం ఇదే వాతావరణం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మధ్యన ఉందనే టాక్ వినిపిస్తోంది. అది కూడా సినిమా కథ విషయంలోనేనట. కాని ఇప్పుడు బయట వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబును ఒక ముఖ్యమైన పాత్ర కోసం చూస్తున్నారు అని టాక్ వచ్చింది. అసలు ఇందులో నిజం ఉందా?
హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో ఇద్దరి మధ్యన కొంచెం డీప్ డిస్కర్షన్ జరుగుతుందని చిత్ర పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు కాని.. అసలు ఈ కథలో ఒక మంచి లేడి క్యారెక్టర్ కోసం పలానా సీనియర్ హీరోయిన్ ను అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలన్నీ అబద్దమేనట. త్రివిక్రమ్ రైటింగ్ డిపార్టమెంట్ లో పనిచేసే అత్యంత సన్నిహితులు.. ఈ విషయం చెబుతున్నారు. నాదియా.. టబు.. సోనాలి బింద్రే.. ఇవన్నీ కేవలం కల్పితాలే కాని.. వాటిలో నిజం లేదంటున్నారు. అసలు ఇంతవరకు అలాంటి ఆలోచనే చేయలేదు అంటున్నారు.
