Begin typing your search above and press return to search.

అంతా వట్టిదే.. చిరు150 జరుగుతోంది

By:  Tupaki Desk   |   22 July 2016 11:35 AM GMT
అంతా వట్టిదే.. చిరు150 జరుగుతోంది
X
మొన్నటివరకు కొన్ని రూమర్లు మెగా ఫ్యాన్స్ ను మరోసారి భయపెట్టేశాయి. ఇప్పటికే రైటర్లు పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు నచ్చకపోవడంతో.. మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా సెకండ్ షెడ్యూల్ ను ఆపేశారని.. ఇప్పుడు మరో రచయిత సాయిమాధవ్ బుర్రాతో డైలాగులు రాయిస్తున్నాడని రూమర్లు చెలరేగిపోయాయ్‌. అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే ఛాన్సుందని టాక్ వచ్చేసింది. కాని ఇందులో ఎంతవరకు నిజముంది?

అస్సలు ఏమాత్రం నిజం లేదనే విషయం అర్ధమైపోతోంది. ఎందుకంటే చిరు 150వ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలైపోయింది. మొన్న బుధవారం నుండి రెండో షెడ్యూల్ ను మొదలుపెట్టారట. ఈరోజు ఉదయం షూటింగు నుండి సెలువ తీసుకుని హైదరాబాద్ లో కబాలి సినిమా చూస్తున్న సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ఈ విషయాన్ని కన్ఫామ్‌ చేశాడు. కాబట్టి మనం షూటింగ్ మొదలవ్వలేదు అనే రూమర్లను అస్సలు నమ్మక్కర్లేదనమాట. అయితే ఇంతకీ ఈ షెడ్యూల్లో కూడా హీరోయిన్ ఎంట్రీ లేనట్లేనా? అందుకే ఇంకా ఎవ్వరినీ సెలక్టు చేసుకోలేదా?

అదంతా తెలియదు కాని.. 150వ సినిమా కోసం కాజల్‌ ను మాత్రం సంప్రదించలేదని టీమ్‌ చెబుతోంది. ఇప్పటికే చరణ్‌ తో చాలా సినిమాలు చేసిన కాజల్ తో చేయడం తనకు ఇబ్బందిగా ఉంటుందని చిరంజీవి చెప్పారట. అది సంగతి.