Begin typing your search above and press return to search.
బోయపాటికి అంత సీన్ ఎక్కడిదో
By: Tupaki Desk | 2 March 2018 10:04 AM ISTటాలీవుడ్ లో రెమ్యూనరేషన్ లెక్కలు బాగా పెరిగిపోయాయి. మిగిలిన వారితో పోల్చితే హీరో- దర్శకుడు చాలా ఎక్కువగా ఛార్జ్ చేసేస్తున్నారు. సినిమాకు అయ్యే ఖర్చులో సగం వీరిద్దరి పారితోషికం రూపంలోనే ఉంటోంది. కొత్త ప్రాజెక్టు ఏదైనా మొదలైతే చాలు.. వీరి రెమ్యూనరేషన్ ఎంతో అనే ఆసక్తి కనిపిస్తోంది.
రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం నిర్మాత డీవీవీ దానయ్య.. బోయపాటికి ఏకంగా 15 కోట్లు ఇస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది. ఇదే చాలామందికి నమ్మబుద్ధేయడం లేదు. ఈ డైరెక్టర్ తీసిన సినిమాల్లో అల్లు అర్జున్ మూవీ సరైనోడు మాత్రమే 70 కోట్లు షేర్ వసూలు చేయగలిగింది. బాలకృష్ణ నటించిన లెజెండ్ కు 40 కోట్లు షేర్ వచ్చింది. రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో తీసిన జయ జానకి నాయక 21 కోట్లు షేర్ మాత్రమే రాబట్టగలిగింది.
అంటే బోయపాటి డైరెక్షన్ అన్నంత మాత్రాన.. ఎంత మాస్ సినిమా అయినా సరే.. హీరోను అనుసరించే మార్కెట్ ఉంటుంది. అయినా.. తీసుకుంటే గీసుకుంటే రామ్ చరణ్ ఎక్కువ అడగాలి కాని.. బోయపాటికి 15 కోట్లు ఎలా ఇస్తారు గురూ? ఇదేదో ఉత్తుత్తి ప్రచారంలా ఉంది అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే త్రివిక్రమ్.. రాజమౌళి మాదిరిగా హీరోగా ఎవరు ఉన్నా.. జనాలను క్యూ కట్టేసేంతటి క్రేజ్ బోయపాటికి లేదన్నది వారి వెర్షన్.