Begin typing your search above and press return to search.

ఇదంతా నిజమా పవన్?

By:  Tupaki Desk   |   28 May 2019 11:06 AM IST
ఇదంతా నిజమా పవన్?
X
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి చిన్న చిన్న పాత్రల నుంచి బడా నిర్మాతగా ఎదిగిన క్రమంలో బండ్ల గణేష్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీ లో తెలియని వారు లేరు. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ జూనియర్ ఎన్టీఆర్ తో బాద్షా లాంటి సూపర్ హిట్ నిర్మించాక అతని పేరు కొంత కాలం అలా మారుమ్రోగిపోయింది. గోవిందుడు అందరివాడేలే తర్వాత నిర్మాణం తగ్గించుకుంటూ వచ్చిన బండ్ల గణేష్ రాజకీయాలంటూ కాంగ్రెస్ కండువా వేసుకున్నాడు కాని అదీ వర్క్ అవుట్ కాలేదు.

సరే ఇదంతా మాములే కదా అని అందరు లైట్ తీసుకున్నారు. ఇప్పుడో పుకారు ఫిలిం నగర్ లో చక్కర్లు కొట్టడం పవన్ ఫాన్స్ ని అయోమయానికి గురి చేస్తోంది. దాని ప్రకారం పవన్ తో బండ్ల గణేష్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. తక్కువ టైంలో మంచి కమర్షియల్ స్క్రిప్ట్ ఒకటి రెడీ చేయమని బోయపాటి శీనుకి చెప్పాడని తాను అడిగితే బాస్ నో చెప్పడనే నమ్మకంతో గణేష్ ఫుల్ ప్లానింగ్ తో ఉన్నాడని అందులో చెబుతున్నారు. ఇది నిజం కాకపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఎందుకంటే పవన్ గతంలో కమిట్ అయిన నిర్మాతలు ఇంకా వెయిట్ చేస్తున్నారు. కొందరి దగ్గర అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు. వాళ్ళను కాదని రాజకీయ పార్టీ అధినేతగా కూడా ఉన్న పవన్ బండ్ల గణేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పటికిప్పుడు జరగని పని. పైగా వినయ విదేయ రామ ఫలితం నేపధ్యంలో నిజంగా కం బ్యాక్ ఇవ్వాలని అనుకున్నా పవన్ ఈ ఫ్యాక్టర్ ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు. సో పవన్ తో బండ్ల గణేష్ సినిమా అనేది టైం పాస్ పుకారు తప్ప అందులో విశ్వసనీయత లేనట్టే