Begin typing your search above and press return to search.

హలో.. ఆ సాంగ్ టాక్ రూమరా?

By:  Tupaki Desk   |   7 Dec 2017 7:26 AM GMT
హలో.. ఆ సాంగ్ టాక్ రూమరా?
X
అక్కినేని యంగ్ హీరో నటించిన అఖిల్ మూవీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. అఖిల్ నిరుత్సాహపరిచిన తర్వాత గ్యాప్ తీసుకుని మరీ.. మనం లాంటి ఎపిక్ మూవీ అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హలో చిత్రాన్ని రూపొందించారు. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ చిత్రంపై.. అక్కినేని అభిమానుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

హలో కోసం అఖిల్ చాలానే మారాడనే సంగతి రీసెంట్ గా విడుదల చేసిన తొలి సాంగ్ ప్రోమోను చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పీక్ స్టేజ్ లో నడుస్తున్న సమయంలో.. హలోకు మళ్లీ షూటింగ్ హడావిడిలో పడినట్లు తెలుస్తోంది. హలో చిత్రానికి ఓ మాంటేజ్ సాంగ్ ఉంటే బాగుంటుందని దర్శకుడు విక్రమ్ కె కుమార్.. హీరో అఖిల్.. నిర్మాత నాగార్జున భావించారట. స్క్రిప్ట్ లో లేని ఈ మాంటేజ్ ను సిద్ధం చేయడం కోసం ఇప్పుడు యూనిట్ అంతా తెగ హడావిడి పడుతోందని తెలుస్తోంది.

హలో విడుదలకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండగా.. కనీసం ఓ వారం ముందయినా సెన్సార్ చేయించాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మాంటేజ్ సాంగ్ కోసం హడావిడి పడుతుండడం ఆశ్చర్యపోవాల్సిన విషయమే. కానీ అనూప్ రూపెన్స్ ఈ సాంగ్ కోసం అద్భుతమైన ట్రాక్ ఇచ్చాడని.. ఇది మూవీకి వాల్యూ అడిషన్ అవుతుందని అంటున్నారు జనాలు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. నిన్న జరిగిన ప్రెస్ మీట్ నాగ్ మాట్లాడుతూ.. సెన్సార్ కాపీని ఈరోజు అప్ లోడ్ చేస్తున్నాం అని చెప్పారు. ప్చ్!! అంటే ఈ సాంగ్ టాక్ కేవలం రూమరా?