Begin typing your search above and press return to search.

చిరంజీవి-స‌ల్మాన్ మ‌ల్టీస్టార‌ర్ నిజ‌మా?

By:  Tupaki Desk   |   10 Aug 2021 5:30 AM GMT
చిరంజీవి-స‌ల్మాన్ మ‌ల్టీస్టార‌ర్ నిజ‌మా?
X
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల వెల్లువ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఎంపిక చేసుకునే కంటెంట్ యూనిక్ గా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో ఉండాల‌ని ప్ర‌తి హీరో త‌పిస్తున్నారు. మ‌న స్టార్ హీరోలంతా ఆల్మోస్ట్ పాన్ ఇండియా ఫీవ‌ర్ తో రాజుకుపోతున్నారు. ఇక సీనియ‌ర్ హీరోల్లోనూ ఈ ఉత్సాహం అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు.

ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి కాన్సెప్ట్ యూనిక్ గా ఉన్న‌ రీమేక్ చిత్రాల‌ను ఎంపిక చేసుకుని మ‌రీ న‌టిస్తున్నారు. అందులో మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ లూసీఫర్ రీమేక్ పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఈ సినిమాకి త‌నిఒరువ‌న్ ఫేమ్ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. మెగాస్టార్ ని ఈ చిత్రంలో అత‌డు ఏ రేంజులో చూపిస్తారు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

ఇక ఇందులో మోహ‌న్ లాల్ పోషించిన సీరియ‌స్ పొలిటీషియ‌న్ రోల్ లో మెగాస్టార్ క‌నిపిస్తారు. అలాగే విల‌న్ గా హీరో స‌త్య‌దేవ్ న‌టిస్తున్నారు. ఇక ఇదే చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ పోషించిన పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌ది కొంత‌కాలంగా స‌స్పెన్స్ గా మారింది. ఇప్ప‌టికే ప‌లువురు న‌టుల‌ను పరిశీలించారు. ఎవ‌రైనా యూనివ‌ర్శ‌ల్ స్టార్ అయితే బావుంటుంద‌ని భావిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ల‌లో చియాన్ విక్ర‌మ్ వంటి స్పెష‌లిస్ట్ హీరో న‌టిస్తే బావుంటుంద‌ని భావించినా చివ‌రికి మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా త‌న బాలీవుడ్ స్నేహితుడు స‌ల్మాన్ ఖాన్ అయితే బెస్ట్ గా ఉంటుంద‌ని భావించార‌ట‌. అనుకున్న‌దే త‌డ‌వుగా స‌ల్మాన్ కి మెగాబాస్ ఫోన్ చేసి విష‌యం చెప్పార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

పృథ్వీరాజ్ పాత్ర ప‌రిమిత స‌న్నివేశాల్లో క‌నిపించినా యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. లాల్ పాత్ర‌కు స‌పోర్టివ్ గా ఆ పాత్ర‌ను తీర్చిదిద్దారు. అలాంటి కీల‌క పాత్ర‌లో స‌ల్మాన్ న‌టిస్తే లూసీఫ‌ర్ రీమేక్ రేంజే మారిపోతుంది. హిందీలోనూ ఈ సినిమాకి బ‌జ్ ఏర్ప‌డుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే త‌న స్నేహితుడు చిరు పిలుపును అందుకుని స‌ల్మాన్ ఈ పాత్ర‌లో న‌టించేందుకు అంగీక‌రిస్తారా లేదా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఈ నెల 15 నాటికి స‌ల్మాన్ న‌టిస్తారా లేదా? అన్న‌దానిపైనా క్లారిటీ రానుంద‌ట‌.

ఇక స‌ల్మాన్ ఖాన్ కుటుంబంతో మెగాస్టార్ కుటుంబానికి చాలా ఏళ్లుగా స‌త్సంబంధాలున్నాయి. చిరు వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ చాలాసార్లు స‌ల్మాన్ ఖాన్ ని ముంబైలో క‌లుసుకున్న సందర్భాలున్నాయి. ఇక స‌ల్మాన్ హైద‌రాబాద్ విచ్చేస్తే చిరుని క‌ల‌వ‌కుండా వెళ్ల‌రు. భాయ్ కి ఆథిత్యం మెగా ఫ్యామిలీనే ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఎన్వీ ప్ర‌సాద్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఇండ‌స్ట్రీ టాప్ టెక్నీషియ‌న్లు ప‌ని చేయ‌నున్నారు. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న క‌థానాయిక ఎవ‌రు? అంటే .. నిజానికి మాతృక‌లో మోహ‌న్ లాల్ కి క‌థానాయిక ఉండ‌రు. అది పూర్తిగా సీరియ‌స్ టోన్ తో న‌డిచే రోల్. త‌న‌కు సోద‌రి త‌ర‌హా పాత్ర‌లో కీర్తి సురేష్ ని న‌టింప‌జేయాల‌ని ప్ర‌య‌త్నించినా 3 కోట్ల పారితోషికం డిమాండ్ చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇక స్క్రిప్టు ప‌రంగా మాతృక‌నుంచి డీవియేట్ అవ్వ‌కుండా మోహ‌న్ రాజా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌కు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. త‌దుప‌రి వ‌రుస‌గా మెహ‌ర్ ర‌మేష్- బాబి వంటి యువ‌ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌నున్నారు. ఇప్ప‌టికే వాటికి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు పూర్త‌య్యాయి. చిరుతో సినిమాని ప్రారంభించేందుకు వారంతా ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు.