Begin typing your search above and press return to search.

'ఆచార్య' కన్ఫర్మ్‌ చేయకుండానే 'శేఖర్‌' కన్ఫర్మ్‌!

By:  Tupaki Desk   |   10 Jan 2022 6:34 AM GMT
ఆచార్య కన్ఫర్మ్‌ చేయకుండానే శేఖర్‌ కన్ఫర్మ్‌!
X
ఒమిక్రాన్ వేరియంట్‌ థర్డ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ సినిమాల విడుదల అంతా కూడా గందరగోళం అయ్యింది. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఆర్ ఆర్‌ ఆర్‌ వాయిదా వేశారు. సంక్రాంతి కానుకగా రావాల్సిన ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమా వాయిదా వేశారు. జనవరి సినిమాల మాత్రమే కాకుండా ఫిబ్రవరిలో విడుదల అవ్వాల్సిన సినిమాలు కూడా ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ పెట్టకున్నా ఆంక్షలు లేదా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన పెట్టే అవకాశం ఉంది. కనుక పెద్ద సినిమాలకు అది ఇబ్బందికర విషయం. కనుక ఫిబ్రవరిలో విడుదల అవ్వాలి అనుకున్న పెద్ద సినిమాలు విడుదల కాకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. ఫిబ్రవరిలో ప్రథానంగా మెగా స్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల కావాల్సి ఉంది. ఫిబ్రవరి 4 న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.. ఇప్పటికి కూడా అదే డేట్‌ ను మేకర్స్ రిలీజ్ డేట్‌ గా పేర్కొంటున్నారు.

చిరంజీవి ఆచార్య తో పాటు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ను కూడా ఫిబ్రవరిలోనే విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా విడుదల విషయంలో కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. దాంతో ఏం జరుగబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆచార్య ఎలాగూ విడుదల వాయిదా కనుక నేను వస్తాను అన్నట్లుగా రాజశేఖర్ తన శేఖర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. జీవిత దర్శకత్వంలో రూపొందిన 'శేఖర్‌' సినిమాలో ఆయన కూతురు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా పై రాజశేఖర్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చాలా నమ్మకంతో ఉన్నారు. రాజశేఖర్ ను చాలా విభిన్నంగా ఈ సినిమా లో జీవిత చూపించబోతున్నట్లుగా ఆయన లుక్ ను బట్టి అర్థం అవుతుంది.

ఇక ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కాని ప్రమోషన్ కు తక్కువ సమయం ఉండటంతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ విషయంలో కూడా కాస్త చర్చలు నడుస్తున్నాయి కనుక సంక్రాంతికి విడుదల చేయలేక పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. సంక్రాంతిని మిస్ చేసుకున్న శేఖర్‌ చిత్రంను ఫిబ్రవరి 4న విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మీడియా కు ఆ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అదే రోజున ఆచార్య సినిమా విడుదల ఉండటం వల్ల చర్చ మొదలు అయ్యింది. కరోనా ఎఫెక్ట్ తో కచ్చితంగా ఆచార్య సినిమా ను ఆ తేదీకి విడుదల చేయక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఆచార్య మేకర్స్ కూడా హడావుడి ఏమీ చేయడం లేదు కనుక విడుదల పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాని ఇటీవల విడుదల అయిన పాటకు సంబంధించిన పోస్టర్‌ లో కూడా సినిమా ఫిబ్రవరి 4 అనే ఉంది. కనుక ఆచార్య విడుదల వాయిదా విషయం కన్ఫర్మ్‌ అవ్వలేదు.. ఇదే సమయంలో అదే తేదీకి శేఖర్ వస్తానంటూ కర్ఫర్మ్‌ గా చెబుతున్నాడు. ఆచార్య కనుక అలాగే నిలబడితే అప్పుడు శేఖర్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. కాని ఆచార్య విడుదల తేదీ విషయంలో శేఖర్‌ యూనిట్‌ సభ్యులకు ఒక స్పష్టత ఉండటం వల్లే ఆ తేదీకి వెళ్లి ఉంటారు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస.