Begin typing your search above and press return to search.

స‌మంత‌కు ఆస్వ‌స్థ‌త.. అస‌లు నిజం ఏంటీ?

By:  Tupaki Desk   |   13 Dec 2021 9:35 AM GMT
స‌మంత‌కు ఆస్వ‌స్థ‌త.. అస‌లు నిజం ఏంటీ?
X
స్టార్ హీరోయిన్ స‌మంత విడాకులు ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా టార్గెట్ గా నిలుస్తున్నారు. ఆమె పై రోజుకో న్యూస్ వైర‌ల్ అవుతూనే వుంది కొంత మంది ప‌నిగ‌ట్టుకుని ఆమెని ట్రోల్ చేస్తూనే వున్నారు. తాజాగా ఆమె అస్వ‌స్థ‌త‌కు గురైందంటూ ఓ వార్త‌ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేయ‌డం మొద‌లైంది. దీనిపై ఆమె మేనేజ‌ర్ మ‌హేంద్ర వివ‌ర‌ణ ఇచ్చారు. వివ‌రాల్లోకి వెళితే .. ఇటీవ‌ల స‌మంత స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైంది. దీంతో ఆమె హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేకంగా టెస్టులు చేయించుకుంది.

గ‌త కొన్ని రోజులుగా తిరుప‌తి, శ్రీ‌కాళ‌హ‌స్తి, క‌డ‌ప త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. ఆ త‌రువాత నుంచి ఆమె జ్వ‌రం, జ‌లుబుతో బాధ‌ప‌డుతోంది. దీంతో ఆమె హైద‌రాబాద్ లోని ఏఐజీ హాస్పిట‌ల్ లో ముందు జాగ్ర‌త్త‌గా టెస్టులు చేయించుకుంది. అనంత‌రం ఇంట్లోనే వుంటూ విశ్రాంతి తీసుకుంటోంద‌ట‌. ఇదిలా వుంటే సామ్ ఆరోగ్యంపై సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా పుకార్లు వినిపించ‌డం మొద‌లైంది. సమంత అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంత మంది ప్ర‌చారం మొద‌లుపెట్టారు.

ఈ ప్ర‌చారంపై ఆమె మేనేజ‌ర మ‌హేంద్ర వివ‌ర‌ణ ఇచ్చారు. సామ్ ఆరోగ్యంగా వున్నార‌ని, స్వ‌ల్ప అస్వ‌స్థ‌త కార‌ణంగా ఇంట్లోనే ఆమె విశ్రాంతి తీసుకుంటున్నార‌ని, సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో స‌మంత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవ‌ల `శాకుంత‌లం` చిత్రాన్ని పూర్తి చేసిన స‌మంత ఇటీవ‌లే శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్న సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ `య‌శోద‌` షూటింగ్ లో పాల్గొన్న విష‌యం తెలిసిందే.