Begin typing your search above and press return to search.

చైతూ డేటింగ్ రూమర్స్ వైరల్ అవ్వడానికి సమంతనే కారణమా..?

By:  Tupaki Desk   |   21 Jun 2022 11:30 AM GMT
చైతూ డేటింగ్ రూమర్స్ వైరల్ అవ్వడానికి సమంతనే కారణమా..?
X
ఇప్పుడు. మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య డేటింగ్ రూమర్స్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. సమంత తో విడాకుల తర్వాత చైతూ ప్రస్తుతం హీరోయిన్ శోభితా ధూళిపాళతో ఎఫైర్ సాగిస్తున్నారని నేషనల్ మీడియాకు చెందిన ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రూమర్స్ వైరల్ అవ్వడానికి సామ్ కారణమని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం.. నాగ చైతన్య మరియు శోభిత ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ లో కొత్తగా నిర్మిస్తున్న చైతూ ఇంట్లో కనిపించారు. అలానే 'మేజర్' ప్రమోషన్స్ టైంలో శోభిత కోసం ఆమె బస చేసిన హోటల్ కు చై పలుమార్లు వచ్చారని ఆర్టికల్ లో పేర్కొన్నారు.

అయితే నేషనల్ మీడియా ప్రసారం చేసిన నాగచైతన్య - శోభిత డేటింగ్ రూమర్స్ విషయంలో తెలుగు ప్రధాన మీడియా మరియు వెబ్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. జాతీయ మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ వారి పేర్లను ప్రస్తావించకుండానే ఆ పుకార్లను నివేదించాయి.

అందులోనూ ఈ రూమర్స్ పై చై - శోభిత కూడా స్పందించకపోవడంతో ఈ వార్త ఎక్కువమందికి తెలియలేదు. కానీ ఎప్పుడైతే ఈ వ్యవహారంలో సామ్ ఎంటర్ అయిందో అప్పుడే అందరికీ తెలిసిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

నాగ చైతన్య - శోభిత ఎఫైర్‌ వార్తల వెనుక సమంత మరియు ఆమె టీమ్ ఉందని కొందరు అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపించారు. చైతన్య ప్రతిష్టను దిగజార్చేందుకే ఆమె పీఆర్ టీమ్ తప్పుడు రూమర్స్ లోకి తమ హీరోని లాగుతున్నారని కామెంట్స్ చేశారు.

ఈ నేపథ్యంలో నాగచైతన్య డేటింగ్ రూమర్స్ లో సమంత పాత్ర ఉందని.. ఆమె టీమ్ అక్కినేని ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారని ఓ వెబ్ సైట్ లో వార్త వచ్చింది. దీన్ని సమంత ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ వారికి గట్టిగా సమాధానమిచ్చింది.

'అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే. అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయించింది. ఎదగండి అబ్బాయిలు. అందులో ప్రమేయం ఉన్న పార్టీలు స్పష్టంగా మూవ్ ఆన్ అయ్యారు. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీ పని మీద, మీ కుటుంబాల మీద దృష్టి పెట్టండి. మూవ్ ఆన్ అవ్వండి' అని సమంత ట్వీట్ లో పేర్కొంది.

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సమంత హ్యాండిల్ నుంచి ఇలాంటి ట్వీట్ రావడంతో.. ఇది కొద్ది నిమిషాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది. ఎంతమందికి రీచ్ అవ్వాలో అంతమందికి చేరింది. దీంతో తెలుగు మీడియా సైతం నాగచైతన్య - శోభిత పేర్లతోనే ఆర్టికల్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చై డేటింగ్ రూమర్స్ కు సంబంధించిన ఆర్టికల్ ను షేర్ చేయకుండా సమంత పరోక్షంగా కౌంటర్ ఇచ్చేలా ట్వీట్ పెట్టి ఉండొచ్చు. విడాకుల ప్రకటన తర్వాత ఇన్ని నెలలుగా సామ్ ఇదే చేస్తూ వస్తోంది. ఏదో నిగూఢ అర్థం వచ్చేలా ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన 'అమ్మ చెప్పింది' కోట్స్ ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా సమంత అలానే చేసి ఉంటే బాగుండేదని.. ఆమె ట్వీట్ కారణంగానే ఈ పుకార్లపై ఎక్కువ చర్చ జరుగుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది నాగచైతన్య తో పాటుగా దీనితో ఎలాంటి సంబంధం లేని థర్డ్ పర్సన్ శోభిత ధూళిపాళ్ల కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిపడిందని.. ప్రమేయం లేకుండా ఆమె ఇందులోకి లాగబడిందని అంటున్నారు.

ఏ హీరోయిన్ కైనా ఎఫైర్స్ కు సంబంధించిన రూమర్స్ అనేవి ఇబ్బందికి గురి చేస్తాయి. అందులోనూ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న శోభిత లాంటి తెలుగమ్మాయి కెరీర్ పై కచ్చితంగా ఇలాంటివి ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంటున్నారు.

అందుకే సామ్ ఈ విషయంలో అందరి సెలబ్రిటీల మాదిరిగా ట్రోల్స్ ను ఇగ్నోర్ చేయడమో లేదా ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తేనో బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్ కు విసిగిపోయే ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. డివోర్స్ తర్వాత సమంతను కొందరు నెటిజన్లు అనాలోచితంగా టార్గెట్ చేసిన మాట వాస్తవమే.

ఇదిలా ఉంటే కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో సమంత రూత్ ప్రభు తన విడాకుల గురించి స్పందించారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్యతో విడిపోడానికి గల కారణాల గురించి షోలో సామ్ వినయపూర్వకంగా వెల్లడించిందని అంటున్నారు.

ఇదే నిజమైతే.. జూలైలో డిస్నీ+ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్ ఫైనల్ కట్‌ లో సమంత తన విడాకుల గురించి చెప్పిన విషయాలు ఉంటాయా లేదా అనేది చూడాలి.