Begin typing your search above and press return to search.

చిరు కొత్త సినిమా.. మళ్లీ అవే పుకార్లు

By:  Tupaki Desk   |   11 Jan 2022 1:59 AM GMT
చిరు కొత్త సినిమా.. మళ్లీ అవే పుకార్లు
X
మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలకు కమిట్ అవుతన్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో విడుదల అవ్వాల్సిన ఆచార్య సినిమా ను మళ్లీ వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం మళ్లీ ఆచార్యకు గట్టిగా ఉండబోతుందనే అంతా భావిస్తున్నారు. రెడీ అయిన సినిమా కే కాకుండా సెట్స్ పై ఉన్న సినిమాకు కూడా కరోనా సమస్యలు తప్పడం లేదు. గాడ్ ఫాదర్.. భోళాశంకర్ మరియు వాల్తేరు వీరన్న సినిమాలను చిరంజీవి ఇప్పటికే మొదలు పెట్టాడు. ఈ సినిమాలు చకచక పూర్తి అయితే వెంటనే వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాను చిరంజీవి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా ఈ ఏడాదిలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక చిరంజీవి ప్రతి సినిమా మొదలు అయిన సమయంలో కూడా ఒక వార్త తెగ చక్కర్లు కొట్టడం కామన్ అయ్యింది. ఇప్పుడు వెంకీ కుడుముల సినిమా విషయంలో కూడా రిపీట్ అవుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు శృతి హాసన్ ప్లేస్ లో అనుష్క ను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ప్రతి సినిమా సమయంలో కూడా హీరోయిన్‌ ల విషయంలో ఇలాంటి పుకార్లు షికారు చేయడం కామన్‌ అయ్యింది.

యంగ్‌ హీరోలకు హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది లేదు. కాని సీనియర్ స్టార్‌ హీరోలందరికి కూడా హీరోయిన్స్ ఇబ్బందిగా మారింది. కొత్త వారిని తీసుకోవాలంటే వారి వయసు మరీ తక్కువగా కనిపిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ ను తీసుకుంటే సినిమా కు పెద్దగా బజ్‌ ఉండటం లేదు. దాంతో ఏ హీరోయిన్ ను తీసుకోవాలో పాలుపోక సీనియర్ హీరోలతో సినిమాలు చేసే దర్శకులు జుట్టు పీక్కుంటున్న సందర్బాలు చాలా నే ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం వెంకీ కుడుముల ఆ సమస్యనే ఎదుర్కొంటున్నాడా అనే చర్చ జరుగుతోంది. సినిమా ప్రారంభం అయ్యే వరకు ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇంకా ఎంత మంది పేర్లు పరిశీలనకు వస్తాయి.. మీడియాలో ప్రచారం జరుగుతాయో చూడాలి.