Begin typing your search above and press return to search.
20 ఏళ్ల ముందే ఒక బాహుబలి వచ్చింది
By: Tupaki Desk | 7 Oct 2020 4:00 PM IST‘బాహుబలి’ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. మొత్తంగా భారతీయ సినీ రంగంలోనే ఒక మైలురాయి. ఆ సినిమా సృష్టించిన సంచలనం గురించి, వసూళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే కథ పరంగా చూస్తే అందులో పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించదు. కానీ దాని నేపథ్యం, రాజమౌళి మార్కు టేకింగ్, భారీతనం, ఎఫెక్ట్స్, హీరోయిజం, ఎలివేషన్లు ఆ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. కథ వరకు చూసుకుంటే ఇలాంటి సినిమాలు గతంలోనే చాలా వచ్చాయి. యోధుడైన తండ్రి విలన్ల చేతిలో చనిపోతే.. కొడుకు వచ్చి ప్రతీకారం తీర్చుకోవడం ఎన్నోసార్లు చూసిన ఫార్ములానే. 20 ఏళ్ల ముందు అచ్చం ‘బాహుబలి’ లాంటి కథతోనే ఓ సినిమా తెరకెక్కడం.. అందులోని లీడ్ రోల్స్‌కు బాహుబలి పాత్రలతో చాలా వరకు పోలిక కనిపించడం విశేషం. ఆ సినిమా పేరు.. జయం మనదేరా.
ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే మహదేవనాయుడు పాత్ర అచ్చంగా ‘బాహుబలి’లో అమరేంద్ర బాహుబలిని పోలి ఉంటుంది. కాకపోతే అది అమరేంద్రుడి తరహా జానపద కథానాయకుడి పాత్ర కాదు కాబట్టి విన్యాసాలు చేయదు. కానీ అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. జనాల కోసం మంచి చేయాలని చూస్తుంది. అతణ్ని విలన్లు దొంగ దెబ్బ తీసి చంపేస్తారు. దీంతో అతడి భార్య ప్రతీకారం కోసమే జీవించి ఉంటుంది. తర్వాత హీరో తనయుడు తన నేపథ్యం ఏంటో తెలియకుండా విదేశాల్లో పెరుగుతాడు. ఈ రెండు పాత్రల విషయంలోనూ ‘బాహుబలి’తో పోలికలు కనిపిస్తాయి. అనుష్క తరహాలోనే భానుప్రియ ప్రతీకారం కోసం చూస్తుంటుంది. మహేంద్ర బాహుబలి తన నేపథ్యం తెలియకుండా వేరే కుటుంబంలో పెరుగుతాడు. తర్వాత అభిరామ్ తన తండ్రి గురించి తెలుసుకుని విలన్ల మీదికి దండెత్తి వస్తాడు. తల్లి ప్రతీకారం తీరుస్తాడు. ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రతో ‘జయం మనదేరా’లో అతుల్ కులకర్ణి చేసిన బసవయ్య క్యారెక్టర్‌ను పోల్చుకుని చూడొచ్చు. అప్పట్లో ‘జయం మనదేరా’ మంచి విజయం సాధించి వెంకీ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది.