Begin typing your search above and press return to search.

శ్రీ‌జ క‌ళ్యాణ్.. శ్రీ‌జ కొణిదెల‌గా.. ఆగ‌ని రూమ‌ర్లు!

By:  Tupaki Desk   |   18 Jan 2022 3:07 AM GMT
శ్రీ‌జ క‌ళ్యాణ్.. శ్రీ‌జ కొణిదెల‌గా.. ఆగ‌ని రూమ‌ర్లు!
X
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ ఇన్ స్టా హ్యాండిల్ టైటిల్ మారింది. శ్రీ‌జ క‌ళ్యాణ్ కాస్తా శ్రీ‌జ కొణిదెల‌గా మార‌డంతో టాలీవుడ్ స‌ర్కిల్స్ లో ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవ‌ల‌ శ్రీజ పేరు గాసిప్స్ లో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. బిజినెస్ మేన్ కళ్యాణ్ దేవ్ ని పెళ్లాడిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 18 మార్చి 2016న కళ్యాణ్ దేవ్ ను శ్రీ‌జ‌ వివాహం చేసుకున్నారు. కళ్యాణ్ దేవ్ అమెరికాలో స్థిర‌ప‌డిన‌ నగల వ్యాపారి.. ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్త అయిన కెప్టెన్ కిషన్ కుమారుడు. క‌ళ్యాణ్‌- శ్రీ‌జ‌ జంటకు నవిష్క అనే కుమార్తె ఉంది. ఈ వివాహానికి ముందు శ్రీజ 2007లో శిరీష్ భరద్వాజ్ ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ త‌ర్వాత విడిపోయిన సంగ‌తి తెలిసిందే.

గ‌డిచిన రెండు నెల‌లుగా శ్రీ‌జ క‌ళ్యాణ్ పై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. క‌ళ్యాణ్ దేవ్ తో మ‌న‌స్ఫ‌ర్థ‌లు త‌లెత్తాయ‌ని దీంతో మెగా కుంటుంబం అత‌డి సినిమాల ప్ర‌చారానికి మ‌ద్ధ‌తుగా నిల‌వ‌డం లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌కు సిద్ధ‌మైన క‌ళ్యాణ్ దేవ్- సూప‌ర్ మ‌చ్చి చిత్రానికి మెగా హీరోల ప్ర‌చార మ‌ద్ధ‌తు ల‌భించ‌క‌పోవ‌డంపైనా గుస‌గుస‌లు వినిపించాయి.

ఇలాంటి బలమైన పుకార్ల న‌డుమ‌ శ్రీజ ఈరోజు తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ను శ్రీజ కళ్యాణ్ నుండి శ్రీజ కొణిదెలగా మార్చుకోవ‌డం ర‌క‌ర‌కాల ఊహాగానాలకు తెర తీసింది. కళ్యాణ్ దేవ్ తో శ్రీజ పాత ఫోటోలు ఇప్పటికీ ఆమె ఖాతాలో కనిపిస్తున్నాయి. రూమ‌ర్ల‌ను ఖండిస్తూ ఇరువైపుల నుంచి ఏదైనా ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని మెగాభిమానులు భావిస్తున్నారు.