Begin typing your search above and press return to search.

ఆలియాపై వ‌చ్చిన‌ట్టే దీపిక‌పైనా రూమ‌ర్స్

By:  Tupaki Desk   |   28 April 2021 11:40 AM GMT
ఆలియాపై వ‌చ్చిన‌ట్టే దీపిక‌పైనా రూమ‌ర్స్
X
ఇంత‌కుముందు ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో న‌టిస్తున్న ఆలియా వ‌ల్ల రాజ‌మౌళికి చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయ‌ని ప్ర‌చార‌మైంది. ఆలియా వరుస సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఇచ్చిన క‌మిట్ మెంట్ నెర‌వేర్చ‌లేక‌పోతోంద‌ని ఆర్.ఆర్.ఆర్ నుంచి ఈ బ్యూటీ వైదొల‌గింద‌ని కూడా ప్ర‌చారం సాగిపోయింది. క‌ట్ చేస్తే అన్ని స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకుని రాజ‌మౌళి త‌న వైపున‌కు ఆలియాను తిప్పేసుకున్నారు.

ఆలియా అవ‌స‌రం మేర ద‌ర్శ‌కుడికి స‌హ‌కారం అందించింది. త‌దుప‌రి షెడ్యూల్ కి అందుబాటులో ఉంటాన‌ని ఇటీవ‌ల కోవిడ్ నుంచి కోలుకున్న ఆలియా రాజ‌మౌళికి చెప్పార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇప్పుడు ఇంచుమించు దీపిక ప‌దుకొనే పైనా టాలీవుడ్ లో అలాంటి రూమ‌ర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో వైజ‌యంతి మూవీస్ నిర్మించే పాన్ వ‌ర‌ల్డ్ మూవీలో దీపిక న‌టించాల్సి ఉండ‌గా.. త‌న నుంచి నిర్మాత‌ల‌కు స‌రైన స్పంద‌న లేద‌ని ఫోన్ లో సంప్ర‌దించినా అస్స‌లు స్పందించ‌డం లేద‌ని ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

నిజానికి దీపిక‌తో ప్ర‌భాస్ మూవీకి చిక్కులు త‌ప్ప‌వ‌ని అతడి అభిమానులు కూడా త‌న‌ని హేట్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ లు వైర‌ల్ చేస్తున్నారు. తాను లేడీ సూప‌ర్ స్టార్ అని ప్ర‌భాస్ ని డామినేట్ చేయాల‌న్న అహంతో ఉంటుంద‌నేది అభిమానుల ఆరోప‌ణ‌.

నిజానికి దీపిక ప‌దుకొనే ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. హృతిక్ రోష‌న్ తో ఓ సినిమా చేస్తున్న దీపిక అమితాబ్ తో క‌లిసి హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇంట‌ర్న్ రీమేక్ లో న‌టించ‌నున్నారు. అలాగే ద్రౌప‌ది అనే చిత్రంలోనూ న‌టిస్తారు. ఓవైపు కోవిడ్ షెడ్యూళ్ల‌ను అమాంతం మార్చేసింది. దీంతో అటు బాలీవుడ్ సినిమాల‌కు ఇటు తెలుగు సినిమాల‌కు కాల్షీట్ల స‌ర్ధుబాటులో స‌మ‌స్య‌లు త‌లెత్త‌నున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

బాలీవుడ్ లో లేట్ అవుతున్న‌వ‌న్నీ అక్టోబ‌ర్ లో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. అయితే అప్ప‌టికి నాగ్ అశ్విన్ - ప్ర‌భాస్ సినిమా ప్రారంభ‌మైతే దీపిక కాల్షీట్ల‌తో స‌మ‌స్య ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.