Begin typing your search above and press return to search.

గుస‌గుస‌: షారూక్ ఖాన్ తో RRR బ్యూటీ బిగ్ డీల్

By:  Tupaki Desk   |   21 Jun 2021 5:41 AM GMT
గుస‌గుస‌: షారూక్ ఖాన్ తో RRR బ్యూటీ బిగ్ డీల్
X
హీరోలే నిర్మాత‌లు.. స్టార్ హీరోల‌తో క‌లిసి హీరోయిన్లు కూడా సినిమాలు తీస్తున్నారు. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో చాలా కాలంగా ఉంది. క్రేజీ హీరో క్రేజీ హీరోయిన్ క‌లిసి సొంతంగా ఒక బిజినెస్ వెంచ‌ర్ నో బ్యాన‌ర్ నో ప్రారంభించి సినిమాలు నిర్మిస్తూ స‌క్సెస్ సాధిస్తున్న‌ సంద‌ర్భాలున్నాయి. ఇంత‌కుముందు జూహీచావ్లాతో క‌లిసి కింగ్ ఖాన్ షారూక్ సినిమాలు నిర్మించేవారు. అత‌డితో చాలామంది క‌లిసి భాగ‌స్వామ్యంలో సినిమాలు నిర్మిస్తుంటారు.

ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా వంతు. ఈ అమ్మ‌డు కూడా సొంత నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించి షారూక్ నిర్మాణ సంస్థ‌తో భాగ‌స్వామ్యంలో సినిమాల్ని నిర్మిస్తోంది. ఖాన్ తో భ‌ట్స్ అల‌యెన్స్ గా దీనిని భావించ‌వ‌చ్చు. ఓ వైపు ఆర్‌.ఆర్.ఆర్- గంగూబాయి కతియావాడి - బ్రహ్మాస్త్రా షూటింగ్ ల‌ను పూర్తి చేయాల్సి ఉండ‌గా ఆలియా నిర్మాత‌గా ఈ కొత్త ప్రాజెక్టును ప్ర‌క‌టించడం ఆస‌క్తిగా మారింది.

న‌టిగా పెండింగ్ సినిమాల‌కు కాల్షీట్లు కేటాయిస్తూనే.. అటు నిర్మాత‌గానూ బిజీ అయ్యేందుకు ఆలియా సిద్ధ‌మ‌వుతోంది. అలియా తన తొలి నిర్మాణమైన `డార్లింగ్స్‌`లో తాను న‌టించే పాత్రకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్- అలియా ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ సంయుక్త సహకారంతో నిర్మిస్తున్నాయి.

డార్లింగ్స్ క‌థాంశం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ట‌. ముంబైలోని సాంప్రదాయిక దిగువ మధ్యతరగతి వెత‌ల క‌థ‌ల్ని ఈ సినిమాలో ఆవిష్క‌రించ‌నున్నారు. ఇది డార్క్ కామెడీ జాన‌ర్ అని తెలిసింది. ఇందులో ఆలియా ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నారు. జాస్మీత్ కె రీన్ దర్శకత్వం వహిస్తున్నారు. షెఫాలి షా- విజయ్ వర్మ - రోషన్ మాథ్యూ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇంత‌కుముందు గ‌ల్లీబోయ్స్ లో ఆలియా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ముస్లిమ్ యువ‌తిగా ర్యాప‌ర్ ర‌ణ‌వీర్ ని ప్రేమించే వీర ప్రేమికురాలిగా అద్భుతంగా న‌టించిన సంగ‌తి తెలిసిందే.