Begin typing your search above and press return to search.

రూలర్ అదే హై లైట్ ?

By:  Tupaki Desk   |   10 Nov 2019 4:36 AM GMT
రూలర్ అదే హై లైట్ ?
X
బాలయ్య సినిమా వస్తుందంటే మాస్ ప్రేక్షకుల కు ఎంతో కొంత క్యూరియసిటీ ఉంటుంది. కారణం నందమూరి నరసింహ సినిమా లో వారికి బాగా నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో ముఖ్యం గా ఫైట్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయి.

అయితే ఎన్టీఆర్ ప్రాంఛైజీ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడం తో బాలయ్య అభిమానులంతా మళ్లీ బాలయ్య పవర్ ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ను ఉద్దేశించి సినిమా లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కి చోటిచ్చారట మేకర్స్.

అవును 'రూలర్' లో ఓ భారీ ఫైట్ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ అంటున్నారు. దాదాపు 500 మంది ఫైటర్స్ తో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను శంషాబాద్ సమీపం లో సెట్ వేసి షూట్ చేశారట. అందులోని దే ఆ మధ్య బాలయ్య ఉగ్రరూపంలో మొఖంపై రంగులతో కనిపించిన స్టిల్ అని తెలుస్తుంది. మరి నిజం గానే ఈ ఫైట్ ఆ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తుందా చూడాలి.