Begin typing your search above and press return to search.

రూలర్ భామల స్టైల్ అదిరిందిగా

By:  Tupaki Desk   |   19 Dec 2019 8:17 AM GMT
రూలర్ భామల స్టైల్ అదిరిందిగా
X
నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'రూలర్' రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులకు మెప్పిస్తుందని 'రూలర్' టీమ్ నమ్మకంగా ఉంది. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. బాలయ్యతో పాటుగా హీరోయిన్లు కూడా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.

ఈ సినిమాలో సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక కూడా హీరోయిన్ లాంటి పాత్రే పోషిస్తోందని అంటున్నారు. ఈలెక్కన 'రూలర్' లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టే. ఈ ప్రమోషన్లలో భాగంగా ముగ్గురు ఒక చోట చేరి చిరునవ్వులు చిందించారు. భూమిక.. సోనాల్ రెండు వైపులా నిలుచుంటే మధ్యలో వేదిక నిలుచుంది. భూమిక.. వేదిక ఇద్దరూ జస్ట్ మోడరన్ గా ప్యాంట్ షర్టులు ధరించారు కానీ సోనాల్ మాత్రం ఒక మైక్రో నిక్కర్ ధరించి అల్ట్రా మోడరన్ గా కనిపిస్తోంది. 'రూలర్' ట్రైలర్లో ఈ భామ బికినీలో అందాలు ధారపోసిన సంగతి తెలిసిందే. ప్రమోషన్లలో కూడా గ్లామర్ ఒలకబోయడం మానలేదు.

ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానూ.. కార్పోరేట్ కంపెనీకి అధిపతిగానూ నటిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య ఐరన్ మ్యాన్ గడ్డం గెటప్ చాలామందిని ఆకర్షించింది. మరి ఫుల్ మాస్ మసాలాతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా.. హీరోయిన్లకు బ్రేక్ ఇస్తుందా అనేది మనకు రేపటికి తెలుస్తుంది.