Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆక‌తాయి అందం సొగ‌సుల వ‌ల‌

By:  Tupaki Desk   |   10 Feb 2021 1:30 AM GMT
ఫోటో స్టోరి: ఆక‌తాయి అందం సొగ‌సుల వ‌ల‌
X
కేజీఎఫ్ స్టార్ య‌ష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయ్యింది రుక్షార్ థిల్లాన్. `ర‌న్ ఆంటోని` అనేది సినిమా టైటిల్. ఆ త‌ర్వాత `ఆక‌తాయి` అనే చిత్రంతో టాలీవుడ్ లో నాయిక‌గా ప‌రిచ‌యం అయ్యింది. న‌టిగా తొలి రెండు చిత్రాలు త‌న‌కు ఏమాత్రం ప్ల‌స్ కాలేదు.

త‌ర్వాత నాని-మేర్ల‌పాక గాంధీ కాంబినేష‌న్ లో కృష్ణార్జున యుద్ధం అనే చిత్రంలోనూ నాయిక‌గా న‌టించాక యువ‌త‌రంలో గుర్తింపు ద‌క్కింది. లేలేత య‌వ్వ‌న శిరుల‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేప‌డం ఈ భామ ప్ర‌త్యేక‌త అని కితాబిచ్చేశారంతా. ఆ త‌ర్వాత అల్లు శిరీష్ స‌ర‌స‌న ఏబీసీడీ చిత్రంలో న‌టించినా అది ఫ్లాప‌వ్వ‌డంతో కెరీర్ కి ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేదు.

కన్న‌డ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు ఇప్పుడు బాలీవుడ్ లోనూ ప్ర‌వేశిస్తోంది. `భంగ్రా పా లే` అనే చిత్రంతో హిందీ చిత్ర‌సీమ‌లోనూ అడుగుపెట్టింది. కానీ ఇవేవీ ఈ అమ్మ‌డికి ఆశించినంత స‌క్సెస్ ని ఇవ్వ‌లేదు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌క త‌న ప్ర‌య‌త్నం తాను చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ నిరంత‌ర ఫోటోషూట్ల‌తో అభిమానుల్ని పెంచుకుంటోంది. తాజాగా రుక్షార్ షేర్ చేసిన‌ హాటెస్ట్ థై స్లిట్ ఫోటో వైర‌ల్ గా మారింది. ఈ త‌ర‌హా వేడెక్కించే ఫోటోలు రుక్షార్ ఇన్ స్టాలో లెక్క‌కు మిక్కిలిగా అగ్గి రాజేస్తున్నాయి.