Begin typing your search above and press return to search.

ఫ్లాపులొచ్చినా నాని హీరోయిన్‌ తగ్గదట

By:  Tupaki Desk   |   11 April 2018 5:30 PM GMT
ఫ్లాపులొచ్చినా నాని హీరోయిన్‌ తగ్గదట
X
నాని ‘కృష్ణార్జున యుద్ధం’ చేసేందుకు ఇంకా ఒక్క రోజే స‌మ‌యం ఉంది. ఈ సినిమాలో నాని కృష్ణ‌- అర్జున్ అనే రెండు విభిన్న‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మాస్ పొర‌గాడు కృష్ణ స‌ర‌స‌న క్లాస్ గా క‌నిపిస్తోంది రుక్స‌ర్ దిల్లాన్‌. నాని ప‌క్కన ప‌క్క‌న ప్రెష్ గా కొత్త హీరోయిన్ లా క‌నిపిస్తున్నా... ఇప్ప‌టికే రుక్స‌ర్ రెండు సినిమాలు చేసిందంటే న‌మ్మ‌శ‌క్యం కాదు.

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌- రాజ‌మౌళి అన్న ఎస్‌.ఎస్‌. కంచి తొలిసారి ద‌ర్శ‌కుడిగా మారి తీసిన ‘షో టైమ్‌’ సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది రుక్సార్‌ థిల్లాన్ అని పిలవబడుతున్న రుక్సార్ మీర్. అయితే ఆ సినిమా ఇంత వ‌ర‌కూ విడుద‌ల కాలేదు. ఎప్పుడు విడుద‌ల‌వుతుందో కూడా తెలీదు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు ‘ఆక‌తాయి’ అనే చిన్న‌ సినిమాలో న‌టించింది రుక్సార్. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా ఫ్లాప‌య్యింది. మొద‌టి రెండు సినిమాలు నిరాశ ప‌రిచినా రుక్స‌ర్ న‌మ్మ‌కం కోల్పోలేదు. ప‌ట్టువ‌ద‌ల‌కుండా ప్ర‌య‌త్నించి నాని ప‌క్క‌న భ‌లే ఛాన్స్ కొట్టేసింది. ‘ఇన్నాళ్లు నేను క‌ల‌లు గ‌న్న సినిమా ఇదే’ అంటూ ఆనంద‌ప‌డుతోంది ఈ చిన్నది.

ఈ సినిమాలో రియా అనే ఎన్‌.ఆర్‌.ఐ పాత్ర‌ను పోషిస్తున్నాన‌ని... త‌న‌కు ఊరు మొత్తం చూపించే గైడ్ పాత్ర‌లో కృష్ణ క‌నిపిస్తార‌ని... ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్ భ‌లేగా ఉంటుంద‌ని తెగ న‌మ్మ‌కంగా చెబుతోంది రుక్స‌ర్‌. ఈ సినిమా హిట్ట‌యితే పాప‌కు మ‌రిన్ని ఆఫ‌ర్లు రావడం ప‌క్కా.