Begin typing your search above and press return to search.

మొటిమలలోనే అందమంతా ఉన్నది

By:  Tupaki Desk   |   13 July 2018 5:52 AM GMT
మొటిమలలోనే అందమంతా ఉన్నది
X
సౌత్ హీరోయిన్లను మేకప్ లేకుండా చూడటం బహు అరుదు. ప్రయోగాత్మక సినిమాల్లోనే ఆలా చూపిస్తారు కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కానీ ప్రేమ కథల్లో కానీ కథానాయిక అందంగా ఉండి తీరాలి. ఈ డెఫినేషన్ కి సాయి పల్లవి అర్థం మార్చేసింది. తన మొహం మీద మొటిమలను ఏ మాత్రం దాచకుండా అది కూడా అందంలో భాగమే అనేలా నటన ద్వారా మెప్పించిన తీరు ఇప్పుడు అన్ని భాషల్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు తెచ్చి పెడుతున్నాయి. తాజాగా ఈ లీగ్ లో మరో హీరోయిన్ చేరేలా ఉంది. సుశాంత్ హీరోగా రూపొందుతున్న చిలసౌలో పరిచయమవుతున్న రుహాని శర్మ కుడి బుగ్గ మీద మొటిమలు ఉండటాన్ని టీజర్ లో గమనించిన ప్రేక్షకులు ఇవి నిజంగా ఉన్నావా లేక సహజత్వం కోసం అతికించారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రమోషన్ ఈవెంట్ లో రుహనిని చూసినప్పుడు కాస్త క్లారిటీ రావొచ్చు.

బాగా గ్యాప్ తీసుకుని సుశాంత్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు పెంచే పనిలో ఉంది అన్నపూర్ణ సంస్థ. నాగ చైతన్య దీని గురించి ఈ మధ్య పలు ఇంటర్వ్యూలలో ప్రత్యేకంగా ప్రస్తావించడం సినిమా నచ్చడం వల్లే తమ బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నామని ప్రకటించడం చూసాం. మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిలసౌ ఈ నెల 27 విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి ఆ డేట్ ఫిక్స్ చేసారు కానీ సాక్ష్యం లాంటి సినిమాలు పోటీ ఉన్న నేపధ్యంలో ఏదైనా మార్పు చేస్తారేమో చూడాలి. రుహాని శర్మ దీని మీద గట్టి ఆశలే పెట్టుకుంది. గ్లామర్ షోకు దూరంగా హోమ్లీ పాత్ర ద్వారా పరిచయమవుతున్న బ్యూటీకి ఇది కనక హిట్ అయితే అవకాశాలు వెల్లువెత్తుతాయి అనడంలో డౌట్ అక్కర్లేదు.