Begin typing your search above and press return to search.
ఎర్ర కోకలో మైండ్ బ్లాక్ చేసిన హిమచల్ అందం
By: Tupaki Desk | 4 Sept 2021 5:00 AM ISTఎర్ర కోక కిర్రెక్కిపోనీ.. పాల పిట్ట వెర్రెక్కిపోనీ..! హిమానీ నదాలు అయినా కరిగిపోయేంతటి ఈ అందగత్తె ఎవరై ఉంటారు? అంటే.. వరుస చిత్రాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న ఉత్తరాది బ్యూటీ రుహానీ శర్మ. సుశాంత్ సరసన రొమాంటిక్ డ్రామా `చి.ల.సౌ`తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా విజయం సాధించిన తరువాత విశ్వక్ సేన్ నటించిన `HIT: ది ఫస్ట్ కేస్`.. ఎం.ఎస్.రాజు `డర్టీ హరి` చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాల్లో తనకు నటిగా నిరూపించుకునేంత పెద్ద స్కోప్ రాలేదు. స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ``కథతో నన్ను ఒప్పిస్తే స్క్రీన్ స్పేస్ నాకు ముఖ్యం కాదు. ఇది రెండు సన్నివేశాలు అయినా.. నేను బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సినిమాలో భాగం అవుతాను. స్క్రిప్ట్ ను ఎంచుకునేటప్పుడు మొత్తం సినిమా లో నటనకు స్కోప్ ఉన్న పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంటుంది..`` అని రుహానీ తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.
రొమాంటిక్ కామెడీ `నూటొక్క జిల్లాల అందగాడు`లో శ్రీనివాస్ అవసరాల సరసన రుహాని నటించింది. సమాజంలో సౌకర్యంగా లేని బట్టతల వ్యక్తి కథ ఇది. ప్రతిదా దాచేస్తూ బయటికి కనిపించే అతడు చివరికి తనను తాను ఎలా కనుగొన్నాడు..? అతను వాస్తవాన్ని అంగీకరించాడా లేదా? అన్నదే ఈ సినిమా. అతను తనని తన రూపాన్ని అంతిమంగా ప్రేమిస్తాడు. ఇదీ థీమ్..! ఇటీవలే రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.
కథానాయకుడు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కోసం తీవ్రంగా వెతికే క్రమంలో విగ్ తో సమస్యలు తలెత్తుతాయి. అతని పొరపాటు బహిర్గతమవుతున్నా.. `నూటొక్క జిల్లాల అందగాడు` చాలా చమత్కారంగా వ్యవహరిస్తాడు. అవసరాల చక్కగా నటించారని టాక్ వచ్చింది. ఈ సినిమాలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో రుహానీ నటించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెడ్ హాట్ శారీలో రుహానీ ప్రత్యక్షమైంది. హిమచల్ బ్యూటీ అందచందాలకు యూత్ ఫిదా అయిపోతున్నారు మరి. బట్టతల నేపథ్యంలో బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా ఓ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.