Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: హిట్ పాప బ్లాక్ బస్టర్ లుక్కు!

By:  Tupaki Desk   |   2 May 2020 1:30 AM GMT
ఫోటో స్టోరీ: హిట్ పాప బ్లాక్ బస్టర్ లుక్కు!
X
మనకు టాలీవుడ్లో హవా అంతా పరాయి భాషలనుంచి వచ్చిన భామలదే కదా. ఇప్పటికే ఉన్న వారితో పాటుగా ఎంతోమంది కొత్త హీరోయిన్లు కూడా ఎంట్రీ ఇస్తుంటారు కానీ అందరికీ బ్రేక్ దక్కదు. ప్రస్తుతం రుహాని శర్మ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ బ్యూటీ సుశాంత్ నటించిన 'చిలసౌ' సినిమాతో హీరోయిన్ గా తెలుగువారికి పరిచయం అయింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు కానీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి రుహాని కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయిన విశ్వక్ సేన్ 'హిట్' లో కూడా హీరోయిన్ గా నటించింది.

ఈ భామ పాతకాలం హీరోయిన్లలాగా ఉంటే లాభం లేదని డిసైడ్ అయినట్టుంది. అందుకే తనలోని గ్లామర్ కోణం బయటకు తీసి ఇన్స్టాగ్రామ్ వాకిట్లో అందమైన ఫోటో ముగ్గులేస్తోంది. ఈమధ్యే ఈ భామకు సంబంధించిన ఒక ఫోటోను ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఫైజి అలీ తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ ఫోటో షూట్ గతంలో చేసినట్టే ఉంది కానీ ఫోటో మాత్రం అదిరిపోయిందంతే. బటన్లు పెట్టుకోకుండా ధరించిన డెనిమ్ షర్టు.. అద్దం పక్కనే నిలుచుని ఓ సెన్సువల్ పోజు ఇచ్చింది రుహాని. ఈ ఫోటోలో స్పెషాలిటీ ఏంటంటే ఇది 'నో మేకప్ లుక్'. బ్లాక్ అండ్ వైట్ కావడంతో ఆ విషయం మనం కొంచెం గమనించి చూస్తే కానీ తెలియదు.

ఈ ఫోటోకు "లవ్లీ బ్యూటీ".. "బ్యూటీ ఆన్ ఫైర్".. "ఝకాస్ లాక్ డౌన్ ఫోటో" అని నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఇక రుహాని ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'డర్టీ హరి'.. 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాల్లో నటిస్తోంది. హిందీలో 'ఆగ్రా' అనే సినిమాలో కూడా నటిస్తోంది.